దుబాయ్ టాక్సీల్లో డు వైఫై, స్మార్ట్ స్క్రీన్ ..
- December 29, 2016
దుబాయ్ ట్యాక్సీ కార్పొరేషన్, రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీతో కలిసి 'డు' సంస్థ యూఏఈ వ్యాప్తంగా 500 ట్యాక్సీల్లో వైఫై మరియు, స్మార్ట్ స్క్రీన్‌లను అందుబాటులోకి తెస్తోంది. అయితే ఇవి దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌కి చెందిన ట్యాక్సీలు కావడం గమనించదగ్గది. దుబాయ్ స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా తమవంతుగా ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తున్నట్లు 'డు' నిర్వాహకులు తెలిపారు. స్మార్ట్ స్క్రీన్స్‌లో ప్రమోషనల్ అడ్వర్‌టైజ్‌మెంట్స్, ఆర్‌టిఎ సర్వీసులు, అలాగే దుబాయ్‌కి చెందిన ప్రముఖ టూరిస్ట్ డెస్టినేషన్ల గురించి ప్రయాణీకులకు తెలిపేలా సమాచారం అందుబాటులో ఉంటుందని డు సంస్థ ప్రకటించింది. వైఫై యుఎఇ అనే దేశవ్యాప్త ఇనీషియేటివ్‌ని డు సంస్థ ప్రతిస్టాత్మకంగా తీసుకుందనీ, తద్వారా వైఫైని పబ్లిక్ తేలిగ్గా, అన్నిచోట్లా పొందేందుకు కృషి చేస్తున్నామని, యూఏఈ 2021 విజన్‌లో ఇదీ ఓ భాగమని ఆ సంస్థ ప్రతినిథులు వెల్లడించారు. మలేషియన్ ఐసిటి సొల్యూషన్స్ డెవలపర్ గిగాలింక్ సొల్యూషన్స్ ద్వారా దుబాయ్ ఎయిర్‌పోర్ట్ టాక్సీలకు స్మార్ట్ స్క్రీన్స్‌ని అందిస్తున్నారు.
తాజా వార్తలు
- ఘనంగా వారధి ఇండియా ఫౌండేషన్ వార్షిక వేడుకలు
- ఆసియా క్రీడలకు గ్రాండ్ ఫినిష్.. 85 పతకాలతో భారత్
- దుబాయ్‌లో రెంట్ పెంచుతున్నారా? RERA ఇండెక్స్‌లో పెంపు లేదంటే టెనెంట్లు ఏం చేయాలి?
- ఒమన్‌లో దొంగతనం కేసు.. వ్యక్తి అరెస్ట్..!!
- కువైట్‌లో 263 భవనాల కూల్చివేతకు ఆదేశాలు..!!
- సౌదీలో భారీ వర్షాలు.. పలు ప్రాంతాల్లో ఆకస్మిక వరదల ముప్పు..!!
- బహ్రెయిన్‌లో కోస్ట్ గార్డ్ సంయుక్త తనిఖీలు..!!
- ఖతార్‌లో ఈవీ ఛార్జింగ్ నెట్వర్క్ విస్తరణ..!!
- ఖతార్ లో కస్టమర్ సర్వీస్ వీక్ 2026ను నిర్వహిస్తున్న PHCC..!!
- సౌదీ అరేబియాలో పండ్లు, కూరగాయల దిగుమతికి కొత్త నిబంధనలు..!!







