కూకట్‌పల్లిలో ఓలా క్యాబ్ డ్రైవర్లు ఆందోళన

- December 29, 2016 , by Maagulf
కూకట్‌పల్లిలో ఓలా క్యాబ్ డ్రైవర్లు ఆందోళన

నగరంలోని కూకట్‌పల్లి ఓలా క్యాబ్ కార్యాలయం వద్ద డ్రైవర్లు ఆందోళన చేపట్టారు. సమస్యలపై యాజమాన్యాన్ని కలిసేందుకు వచ్చిన డ్రైవర్లపై బౌన్సర్లు దాడిచేశారు. ఆగ్రహించిన డ్రైవర్లు బౌన్సర్లను పట్టుకుని చితకబాదారు. దీంతో ఉద్రిక్తవాతావరణం నెలకొంది. రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గీయులను చెదరగొట్టారు. డ్రైవర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత కొద్దిరోజులుగా వాహనాల సంఖ్య పెరిగింది. ఓలా క్యాబ్స్ ఇచ్చిన వాహనాలు సరిగ్గా నడవకపోవడం, అదే విధంగా డ్రైవర్లు డబ్బులు సరిగ్గా చెల్లించకపోవడంతో యాజమాన్యం బాగా ఒత్తిడి తీసుకొచ్చింది. ట్రిప్పుల విషయంలో తేడా వచ్చిందని ఓనర్లు చెబుతున్నారు. సుమారు 1000మంది డ్రైవర్లు ఆఫీసుకు చేరుకుని ఆందోళన చేపట్టారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com