డిసెంబర్ 31వ తేదీ రాత్రి ఆకాశంలో కనపడనున్న అరుదైన తోక చుక్క

- December 29, 2016 , by Maagulf
డిసెంబర్ 31వ తేదీ రాత్రి ఆకాశంలో కనపడనున్న అరుదైన తోక చుక్క

కొత్త సంవత్సరం సమీపించిన నేపథ్యంలో.. కొత్త ఏడాదికి సరిగా ఒకరోజు ముందు ఖగోళంలో ఓ తోక చుక్క కనిపించబోతుందని నాసా ప్రకటించింది. డిసెంబర్ 31వ తేదీ రాత్రి ఆకాశంలోకి చూస్తే.. 45పీ హోండా-మార్కోస్-పజ్డూసకోవా అనే తోక చుక్క దర్శనమివ్వబోతుందని నాసా శాస్జ్రజ్ఞులు తెలిపారు. అయితే నేరుగా కళ్లతో చూసేవారికి ఇది కనబడే అవకాశం లేదు. కాబట్టి ఈ తోక చుక్కను చూడాలంటే ఖచ్చితంగా బైనాకులర్స్‌ ఉపయోగించాల్సిందే. 1948లో హోండా, మార్కోస్, సకోవా అనే ఖగోళ శాస్త్రజ్ఞులు ఈ తోక చుక్కను కనిపెట్టడం వల్ల వారి పేర్లు వచ్చేలాగానే ఈ తోకచుక్కకు పేరు పెట్టారు. కాగా, ఈ తోక చుక్క 5.25 ఏళ్లకోసారి తాను సూర్యుడు చుట్టూ తిరిగే గమనాన్ని పూర్తి చేసుకుంటుందని, ఆ క్రమంలోనే అది భూమికి సమీపంగా వస్తుందని శాస్త్రజ్ఞులు చెప్పారు. ఆ తర్వాత సూర్యుడి నుంచి దూరమవతున్నా కొద్ది కనుమరుగవుతుందని నాసా వర్గాలు వెల్లడించాయి. ఇది తొలిసారిగా డిసెంబర్‌ 15వ తేదీన కనిపించిందని, రోజురోజుకు కొంత వెలుతురూ పెరుగుతూ జనవరి 1వ తేదీ వరకు కనిపిస్తుందని నాసా పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com