'ఖైదీ..' పాటలు కుమ్మేస్తున్నాయ్‌!

- December 30, 2016 , by Maagulf
'ఖైదీ..' పాటలు కుమ్మేస్తున్నాయ్‌!

చిరంజీవి కథానాయకుడిగా నటించిన 'ఖైదీ నంబర్‌ 150' చిత్రం సెన్సార్‌ పనుల్ని పూర్తి చేసుకొని, విడుదలకు సిద్ధమవుతోంది. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ పతాకంపై రామ్‌చరణ్‌ నిర్మించిన ఈ చిత్రానికి వి.వి. వినాయక్‌ దర్శకుడు. ఇప్పటికే నిర్మాణ కార్యక్రమాలు పూర్తయిన ఈ సినిమాకు గురువారం సెన్సార్‌ నుంచి 'యు/ఎ' సర్టిఫికెట్‌ లభించింది. ఇటీవల విడుదలైన పాటలకు శ్రోతల నుంచి విపరీతమైన స్పందన లభిస్తోందని లహరి మ్యూజిక్‌ అధినేత జి. మనోహర్‌నాయుడు తెలిపారు. ''యూ ట్యూబ్‌లో విడుదల చేసిన 'అమ్మడు.. లెట్స్‌ డు కుమ్ముడు' పాటను 7 మిలియన్‌ల మంది చూశారు. 'సుందరీ..' పాట 4 మిలియన్‌ల వ్యూస్‌కు చేరువవుతుంటే, లేటె్‌స్టగా విడుదల చేసిన 'యు అండ్‌ మి' పాట ఒక మిలియన వ్యూస్‌ను దాటింది.
 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com