జపాన్‌లో భూకంపం.. తీవ్రత 5.5గా నమోదు..

- December 30, 2016 , by Maagulf
జపాన్‌లో భూకంపం.. తీవ్రత 5.5గా నమోదు..

జపాన్ తూర్పు తీరంలో శనివారం ఉదయం భూకంప సంభవించింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 5.5 గా నమోదైందని భూకంప అధ్యయన కేంద్రం అధికారులు వెల్లడించారు. టోక్యోకు ఈశాన్యంగా 244 కిలోమీటర్ల దూరంలో 11 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ ప్రాంతంలో తరచుగా భూ ప్రకంపనలు తలెత్తుతుంటాయి. దట్టమైన గాలులు వీచే అవకాశముందని సమాచారం. గత బుధవారం ఇక్కడి డైగో ప్రాంతంలో 6.3 తీవ్రతతో భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. ప్రస్తుత భూకంపం వల్ల తలెత్తిన నష్టం వివరాలు ఇంకా తెలియరాలేదు

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com