'ఖైదీ నెంబర్‌ 150' ఐటెంసాంగ్‌ విడుదల...

- December 31, 2016 , by Maagulf
'ఖైదీ నెంబర్‌ 150'  ఐటెంసాంగ్‌ విడుదల...

వచ్చే సంక్రాంతికి విడుదల కానున్న 'ఖైదీ నెంబర్‌ 150' ప్రమోషన్‌ కార్యక్రమాలను వెరైటీగా ప్లాన్‌ చేస్తోంది చిత్రయూనిట్‌. ఒక్కో రోజు ఒక్కో పాటను విడుదల చేస్తూ క్యూరియాసిటీ పెంచుతోంది. ఇప్పటికే విడుదలైన 'అమ్మడూ లెట్స్‌ డూ కుమ్ముడూ', 'సుందరి', 'యూ అండ్‌ మీ' పాటలకు అద్భుతమైన రెస్పాన్స్‌ వస్తుండగా తాజాగా 'రత్తాలు.. రత్తాలు' అనే పాటను విడుదల చేశారు. ఐటెంసాంగ్‌ స్పెషలిస్ట్‌ అయిన దేవీ మరోసారి మంచి మాస్‌ బీట్‌ ఇచ్చాడు. ఈ సాంగ్‌ మేకింగ్‌ వీడియోను విడుదల చేసింది చిత్ర యూనిట్‌. డ్యాన్స్‌మాస్టర్‌ లారెన్స్‌ ఈ పాటకు కొరియోగ్రఫీ అందించాడు. చిరంజీవితోపాటు లక్ష్మీరాయ్‌ ఈ పాటలో నర్తించింది.

దీంతో ఇప్పటికి ఈ సినిమాలోని నాలుగు పాటలను విడుదల చేశారు. మొత్తం ఆల్బమ్‌ను శనివారం రాత్రి విడుదల చేయనున్నారు. ఇక, వేల మంది అభిమానుల సమక్షంలో జనవరి 4వ తేదీన విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ఈ సినిమా ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com