ఆర్.నారాయణమూర్తి కూడా సంక్రాంతి బరిలో..
- December 31, 2016
శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ బ్యానర్‌పై పీపుల్స్ స్టార్ ఆర్.నారాయణమూర్తి, సహజనటి జయసుధ కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం`హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య`. చదలవాడ పద్మావతి నిర్మిస్తోన్న ఈ చిత్రానికి చదలవాడ శ్రీనివాసరావు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణను పూర్తి చేసుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు తుది దశకు చేరుకున్నాయి. ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయడానికి దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఈ సందర్భంగా...
దర్శకుడు చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ - ``నారాయణమూర్తి, జయసుధగారితో చేసిన హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య ప్రస్తుతం సమాజంలో ప్రధాన సమస్య ఆధారంగా రూపొందింది. అదేంటనేది సినిమా చూడాల్సిందే. ఓ నిజాయితీ గల హెడ్ కానిస్టేబుల్ తన నిజాయితీతో ఉండటం వల్ల ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నాడు. దాన్ని ఎలా అధిగమనించాడనేదే కథ. మంచి కథ, అన్నీ వర్గాల ప్రేక్షకులకు నచ్చే సినిమా అవుతుంది. నారాయణమూర్తి, జయసుధ కలిసి తెరపై కనపడబోతున్నారని తెలియగానే ప్రేక్షకుల్లో ఓ ఆసక్తి ఏర్పడింది. జయసుధగారు, నారాయణమూర్తిగారు ఇద్దరూ చాలా గొప్పగా నటించారు. వీరితో పాటు మిగిలిన అందరూ నటీనటులు, టెక్నిషియన్స్ సపోర్ట్‌తో అనుకున్న విధంగా సినిమా షూటింగ్ అంతా పూర్తయ్యింది. జనవరి మొదటి వారంలో సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసి, పాటలను కూడా జనవరి మొదటివారంలోనే విడుదల చేస్తాం. అలాగే సినిమాను సంక్రాంతికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం`` అన్నారు.
ఆర్.నారాయణమూర్తి, జయసుధ, సునీల్ శర్మ, జయప్రకాశ్ రెడ్డి, తనికెళ్ల భరణి, చలపతిరావు, వెన్నెల కిశోర్, వై.విజయ, సమీర్, విజయ భాస్కర్, విజయ్, పార్వతి తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు సంగీతం: వందేమాతరం శ్రీనివాస్, డైరక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: కె.సుధాకర్ రెడ్డి, ఎడిటర్: మోహన రామారావు, నృత్యాలు: శివసుబ్రహ్మణ్యం, ఫైట్స్: సతీష్ మాస్టర్, సమర్పణ: చదలవాడ తిరుపతిరావు, నిర్మాత: చదలవాడ పద్మావతి, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: చదలవాడ శ్రీనివాసరావు.
తాజా వార్తలు
- భారత్-న్యూజిలాండ్ మధ్య కుదిరిన ఫ్రీ ట్రేడ్ డీల్
- తిరుమలలో వైకుంఠద్వార దర్శనాలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు
- జనవరి 2 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
- వందే భారత్ స్లీపర్ రైలు ట్రయల్ సక్సెస్…
- చికాగోలో ఘనంగా చలనచిత్ర సంగీత కచేరీ
- సైనిక సిబ్బంది పై దాడి..ఇద్దరు వ్యక్తులు అరెస్ట్..!!
- మహిళా సాధికారత..ఉమెన్ ఇన్స్పైర్ సమ్మిట్..!!
- Dh100,000 చొప్పున గెలిచిన నలుగురు భారతీయులు..!!
- మస్కట్‌లో ఖైదీల ఉత్పత్తుల ప్రదర్శన పై ప్రశంసలు..!!
- ఖతార్‌లో విటమిన్ డి లోపం విస్తృతంగా ఉంది:స్టడీ







