శీతాకాలంలో పెదవుల సంరక్షణకు....
- December 31, 2016
శీతాకాలంలో వచ్చిందంటే చాలు పెదవులు పగిలిపోతాయి. పొరపొరలుగా చర్మం రాలిపోతుంది. ఆ పొరలు తీస్తే మంటగా, ఒక్కోసారి రక్తం కూడా వచ్చేస్తుంది. ఈ సమయంలో చాలామంది పెదవులను పదేపదే నాలుకతో తడుపుకోవడం చేస్తుంటారు. ఐతే అలా తడపడం వల్లే పెదవులు పొడిబారి మరింతగా ఎండిపోతాయి. అలాగే పెదవులపై ఎండిపోయిన పొరలను తీసే ప్రయత్నం కూడా కొందరు చేస్తుంటారు. అలా తీయడం వల్ల రక్తం వచ్చి చిన్నచిన్న గాయాలుగా మారతాయి.
ఈ సమస్యకు విటమిన్ ఇ, ఎ-లను కలిగిన లిప్ బామ్‌ను వాడితే మంచిది. ఇవి పెదవులకు కావాల్సిన తేమను అందిస్తాయి. చలికాలంలో దాహం తక్కువగా వేస్తుంది. కావున చాలామంది నీళ్లు తక్కవుగా తాగుతారు. అలాకాకుండా రోజూ ఎనిమిది గ్లాసులకు తగ్గకుండా నీళ్లు తాగాలి. దీనివల్ల పెదవులకు కూడా కావాల్సినంత తేమ, శరీరం నుంచి అందుతుంది. రాత్రి, ఉదయం ముఖం కడగడానికి ముందు లేదా పడుకోవడానికి ముందు పెదాలకు కొబ్బరి నూనె లేదా వెన్నపూస వంటివి రాసి సున్నితంగా మర్దన చేసుకోవాలి. ఆలొవెరా ముక్కతో పెదాలు తరుచుగా రుద్దితే గాయాలు మానిపోతాయి. అలోవేరాలో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. ఇది పెదాలకి తేమని అందిస్తుంది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో తెలుగు ప్రవాసుల ఘన క్రిస్మస్ వేడుకలు
- ఫ్లైనాస్ విమానానికి బాంబు బెదిరింపు..శంషాబాద్‌లో అత్యవసర ల్యాండింగ్
- కాలిఫోర్నియాలో ఇండియన్ సర్వీస్ సెంటర్ ఫ్రారంభం
- నిషేధిత లేదా నకిలీ పెస్టిసైడ్స్ తయారీ, దిగుమతి పై భారీ జరిమానా
- శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా
- అంతర్జాతీయ సైబర్ నెట్వర్క్ గుట్టురట్టు చేసిన సీఐడీ
- అర్జున అవార్డు రేసులో తెలంగాణ క్రీడాకారులు
- శంకర నేత్రాలయ లాస్ ఏంజెలెస్ చాప్టర్ కార్యక్రమం ఘన విజయం
- మౌలానా అబుల్ కలాం అజాద్ అవార్డు గ్రహీత సయ్యద్ నాజర్‌కు ఘన అభినందన సభ
- మస్కట్‌లో ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన...







