తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఎస్ పి సింగ్..

- December 31, 2016 , by Maagulf
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఎస్ పి సింగ్..

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఎస్ పి సింగ్ ను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ప్రస్తుతం ప్రధాన కార్యదర్శిగా ఉన్న ప్రదీప్ చంద్ర పదవీకాలం డిసెంబర్ 31వ, తేదితో ముగిసింది.అయితే ఆయనకు కేంద్రం పదవీకాలాన్ని పొడిగించలేదు.దీంతో ఆయన స్థానంలో ఎస్ పి సింగ్ ను కొత్త సిఎస్ గా నియమిస్తూ ఆదివారం నాడు ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.
స్పెషల్ సిఎస్ లుగా ఉన్న ఎంజి గోపాల్, రాజీవ్ రంజన్ ఆచార్య, ఎస్ పి సింగ్ లలో ఎవరో ఒకరిని ఎంపిక చేయాల్సిన అనివార్య పరిస్థితులు ప్రభుత్వానికి ఉన్నాయి. దరిమిలా కొత్త ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవికి ఎస్ పి సింగ్ వైపే సిఎం కెసిఆర్ మొగ్గుచూపారు.
ఆదివారం ఉదయం పూట కొత్త సిఎస్ పై ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకొన్నారు.

ప్రదీప్ చంద్ర స్థానంలో ఎస్ పి సింగ్ ను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులను వెలువడ్డాయి.
ఎసిబి డిజిపి గా ఉన్న ఎకె ఖాన్ పదవీకాలం కూడ ముగిసింది.అయితే ఆయనను తెలంగాణ మైనార్టీ సంక్షేమశాఖకు సలహాదారుడిగా నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.ఇటీవలనే ఆయన రిటైర్మెంట్ అయ్యారు. ఓటుకు నోటు కేసు సమయంలో ఎకెఖాన్ ఎసిబి డిజిగా బాద్యతలను నిర్వహించారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పరిశ్రమల శాఖ కార్యదర్శిగా ఉన్న అరవింద్ కుమార్ ను డిల్లీకి బదిలీచేసింది ప్రభుత్వం. న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్ కు అరవింద్ కుమార్ రెసిడెంట్ కమీషనర్ గా నియమించింది. తెలంగాణలో పరిశ్రమల స్థాపనలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామిక వేత్తలు ముందుకు రావడంలో అరవింద్ కుమార్ కీలకంగా వ్యవహరించారు,

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com