నన్ను తిడతారని ముందుగానే ఫిక్సయ్యా: మారుతి!

- January 03, 2017 , by Maagulf
నన్ను తిడతారని ముందుగానే ఫిక్సయ్యా: మారుతి!

'ఈరోజుల్లో', 'బస్టాప్‌' వంటి బ్యాక్‌ టు బ్యాక్‌ అడల్డ్‌ కంటెంట్‌ సినిమాలతో ఓవర్‌నైట్‌ స్టార్‌ డైరెక్టర్‌ అయిపోయాడు మారుతి. ఆ రెండు సినిమాలు ఎంతటి విజయాలను సాధించాయో, అంతే వివాదాలను కూడా సృష్టించాయి. తాజాగా ఆ సినిమాల గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడాడు మారుతి. ''నిజానికి 'ఈరోజుల్లో' కంటే ముందు నేను తీసినది 'బస్టాప్‌' సినిమాయే. అయితే డబ్బుల్లేకపోవడంతో 'బస్టాప్‌' సినిమా సగం వరకు షూటింగ్‌ చేసి ఆపేశాం. దాంతో ఏం చేయాలో తెలియక రామ్‌గోపాల్‌ వర్మగారి స్ఫూర్తితో 5డి కెమెరాతో 'ఈ రోజుల్లో' మొదలుపెట్టాం. స్నేహితులను, తెలిసిన వారిని డబ్బులడిగి కేవలం 15 లక్ష ల రూపాయలతో ఆ సినిమా చేశాం.

కానీ, విడుదలకు ముందు చాలా టెక్నికల్‌ ప్రాబ్లమ్స్‌ వచ్చాయి. దాంతో శ్రీనగర్‌కాలనీలో రోడ్డు పక్కనే కార్‌ ఆపి కన్నీళ్లు పెట్టుకున్నా. 
అయితే ఊహించని విధంగా ఆ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. దాంతో ముందుగా సగం వరకు చేసి ఆపేసిన 'బస్టాప్‌'ను మొదలుపెట్టా. ఆ సినిమాలో ఉన్న అడల్ట్‌ కంటెంట్‌ చూసి అందరూ నన్ను తిడతారని ముందుగానే ఫిక్సయ్యా. అనుకున్నట్టుగానే ఆ సినిమా విమర్శలను, డబ్బులను కూడా తీసుకొచ్చింది. ఇక మూడో సినిమా 'ప్రేమకథా చిత్రమ్‌' సినిమాలో ప్రతీ షాట్‌ నేనే తీశా. కానీ, దెయ్యంతో కామెడీ అంటే ఎవరూ చూడరని భయం వేసి నా పేరు వేసుకోలేదు. ఆ సినిమాకు పని చేసిన కెమెరామెన్ పేరును డైరెక్టర్‌ పేరుగా వేశాం.'' అని చెప్పాడు మారుతి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com