నన్ను తిడతారని ముందుగానే ఫిక్సయ్యా: మారుతి!
- January 03, 2017
'ఈరోజుల్లో', 'బస్టాప్' వంటి బ్యాక్ టు బ్యాక్ అడల్డ్ కంటెంట్ సినిమాలతో ఓవర్‌నైట్ స్టార్ డైరెక్టర్ అయిపోయాడు మారుతి. ఆ రెండు సినిమాలు ఎంతటి విజయాలను సాధించాయో, అంతే వివాదాలను కూడా సృష్టించాయి. తాజాగా ఆ సినిమాల గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడాడు మారుతి. ''నిజానికి 'ఈరోజుల్లో' కంటే ముందు నేను తీసినది 'బస్టాప్' సినిమాయే. అయితే డబ్బుల్లేకపోవడంతో 'బస్టాప్' సినిమా సగం వరకు షూటింగ్ చేసి ఆపేశాం. దాంతో ఏం చేయాలో తెలియక రామ్‌గోపాల్ వర్మగారి స్ఫూర్తితో 5డి కెమెరాతో 'ఈ రోజుల్లో' మొదలుపెట్టాం. స్నేహితులను, తెలిసిన వారిని డబ్బులడిగి కేవలం 15 లక్ష ల రూపాయలతో ఆ సినిమా చేశాం.
కానీ, విడుదలకు ముందు చాలా టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. దాంతో శ్రీనగర్‌కాలనీలో రోడ్డు పక్కనే కార్ ఆపి కన్నీళ్లు పెట్టుకున్నా.
అయితే ఊహించని విధంగా ఆ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. దాంతో ముందుగా సగం వరకు చేసి ఆపేసిన 'బస్టాప్'ను మొదలుపెట్టా. ఆ సినిమాలో ఉన్న అడల్ట్ కంటెంట్ చూసి అందరూ నన్ను తిడతారని ముందుగానే ఫిక్సయ్యా. అనుకున్నట్టుగానే ఆ సినిమా విమర్శలను, డబ్బులను కూడా తీసుకొచ్చింది. ఇక మూడో సినిమా 'ప్రేమకథా చిత్రమ్' సినిమాలో ప్రతీ షాట్ నేనే తీశా. కానీ, దెయ్యంతో కామెడీ అంటే ఎవరూ చూడరని భయం వేసి నా పేరు వేసుకోలేదు. ఆ సినిమాకు పని చేసిన కెమెరామెన్ పేరును డైరెక్టర్ పేరుగా వేశాం.'' అని చెప్పాడు మారుతి.
తాజా వార్తలు
- మైక్రోసాఫ్ట్‌లో కీలక పరిణామం..
- రేపు కొండగట్టుకు పవన్ కళ్యాణ్,బీఆర్ నాయుడు..
- బహ్రెయిన్‌లో ఆసియా మహిళకు 15 ఏళ్ల జైలు శిక్ష..!!
- అడ్వెంచర్ గైడ్, సర్టిఫైడ్ మౌంటైన్ ట్రైల్ మ్యాప్స్ ఆవిష్కరణ..!!
- నోమోఫోబియా ఉందా? మొబైల్ ఫోన్ వినియోగం పై డాక్టర్ల వార్నింగ్..!!
- సౌదీ అరేబియాలో కోల్డ్ వేవ్స్..ఎన్‌సిఎం హెచ్చరిక..!!
- కువైట్ లో క్లీనప్ డ్రైవ్.. 73,700 కంపెనీలు తొలగింపు..!!
- మెట్రాష్ యాప్ రిపోర్టింగ్ టూల్స్ ద్వారా పబ్లిక్ సేఫ్టీ..!!
- హైదరాబాద్–విజయవాడ హైవే టోల్ పై కీలక నిర్ణయం
- టెన్త్ మెరిట్‌తో 30 వేల జీడీఎస్ ఉద్యోగాలు







