మహిళల వరల్డ్ కప్: మిథాలీకే టీమిండియా పగ్గాలు...

- January 03, 2017 , by Maagulf
మహిళల వరల్డ్ కప్: మిథాలీకే టీమిండియా పగ్గాలు...

 ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్ క్వాలిఫయిర్స్ టోర్నీలో 14మందితో కూడిన భారత మహిళల జట్టుకు హైదరాబాద్‌కు చెందిన మిథాలీ రాజ్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. ఈ మేరకు బీసీసీఐ మంగళవారం తన ట్విట్టర్‌లో అధికారిక ప్రకటన చేసింది.

శ్రీలంక రాజధాని కొలంబోలో ఫిబ్రవరి 3 నుంచి 21 వరకు ఈ క్వాలిఫయిర్స్ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇటీవలే బ్యాంకాక్‌లో జరిగిన ఆసియా కప్ టీ20 టోర్నీని కైవసం చేసుకున్న మహిళల జట్టు వరుస విజయాలను సొంతం చేసుకుంది.

ఇక జట్టులో కీలకమైన క్రీడాకారిణిలుగా ఉన్న హర్మన్‌ప్రీత్‌ కౌర్‌, స్మృతి మంధన ప్రస్తుతం ఆస్ట్రేలియాలో జరుగుతున్న బిగ్‌బాష్‌ లీగ్‌లో అద్భుతమైన ఫామ్‌ని కనబరుస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com