మొబిక్విక్‌తో ఒప్పందం కుదుర్చుకున్న ఎయిమ్స్
- January 03, 2017
ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్) దిల్లీ డిజిటల్ చెల్లింపుల సంస్థ మొబిక్విక్‌తో ఒప్పందం చేసుకుంది. దీని ద్వారా వైద్యులు, సిబ్బంది, రోగులు నగదు రహిత సేవలను పొందవచ్చు. 'ఎయిమ్స్‌లో చికిత్సలకు సంబంధించిన అన్ని చెల్లింపులు మొబిక్విక్ ద్వారా చెల్లించవచ్చు. వైద్యులు సంప్రదింపుల ఫీజు, పరీక్షలు, ఇతర సర్వీసులు నగదు రహితం కానున్నాయి. జనవరి తొలివారం నుంచి ఇది అందుబాటులోకి వస్తుంది' అని మొబిక్విక్ ఓ ప్రకటనలో తెలిపింది. 'నగదు కొరత సమస్య ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో భారతీయులకు అండగా ఉన్నందుకు గర్వపడుతున్నాం. భారత ఆర్థిక వ్యవస్థను నగదు రహితంగా మార్చేందుకు మా వంతు కృషి చేస్తున్నాం. ప్రఖ్యాత ఎయిమ్స్‌తో భాగస్వామి అయినందుకు సంతోషంగా ఉంది' అని మొబిక్విక్ సహ వ్యవస్థాపకులు ఉపాసన థాకూ తెలిపారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









