'1818' లో త్రిష
- January 03, 2017
'నాయకి' త్రిష సినీ రంగంలో అడుగుపెట్టి పదేళ్ల పైనే కావొస్తున్నా ఈ మిస్ చెన్నై కోసం అవకాశాలు వేచి చూస్తూనే ఉన్నాయి. ఇటీవల 'నాయకి', 'ధర్మయోగి' చిత్రాలతో ఆకట్టుకున్న త్రిష మరో అయిదు చిత్రాల్లో నటిస్తోంది. తాజాగా మరో కొత్త ప్రాజెక్ట్‌కు సంతకం చేసిందట. ముంబయి ఉగ్రదాడులపై తెరకెక్కుతున్న చిత్రంలో త్రిష నటించబోతోంది. ఈ సినిమాకి '1818' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. మైండ్ డ్రామా పతాకంపై నిర్మించనున్న ఈ చిత్రాన్ని రిథున్ సాగర్ దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాలో త్రిష ముఖ్య భూమిక పోషిస్తోంది. సుమన్, రాజేంద్ర ప్రసాద్, రమేశ్ తిలక్, మీరా ఘోషల్‌లు కీలక పాత్రలో నటించనున్నారు. తెలుగు, తమిళంలో ఈ సినిమాని విడుదల చేయడానికి చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. ఎస్‌ఎస్.థమన్ ఈ చిత్రానికి పాటలు సమకూరుస్తున్నారు.
తాజా వార్తలు
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!









