జనవరి 11న రానున్న 'ఖైదీ నెం-150'

- January 03, 2017 , by Maagulf
జనవరి 11న రానున్న 'ఖైదీ నెం-150'

చిరంజీవి 150వ సినిమా 'ఖైదీ నంబర్‌ 150'ను జనవరి 11న విడుదల చేస్తున్నట్టు హీరో రామ్‌చరణ్‌ ప్రకటించారు. బాలకృష్ణ వందో సినిమా 'గౌతమీపుత్ర శాతకర్ణి' కంటే ఒకరోజు ముందే తమ సినిమా విడుదల చేస్తున్నామని తెలిపారు. దీనికి గల కారణాలను వివరిస్తూ ఫేస్ బుక్ లో వీడియో పెట్టారు.

'గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా 12న విడుదలవుతోంది, ఇద్దరు పెద్ద హీరోల సినిమాలు ఒకేరోజు విడుదల కావడం మంచి పరిణామం కాదని నాతో నాన్న అన్నారు. అందుకే ఒకరోజు ముందుగానే జనవరి 11న మా సినిమా విడుదల చేస్తున్నాం. సంక్రాంతికి రెండు పెద్ద సినిమాలు రావడమన్నది సహజమే' అని రామ్‌చరణ్‌ పేర్కొన్నారు.

ప్రీరిలీజ్‌ ఫంక్షన్‌ కు పవన్‌ కళ్యాణ్ ను ఆహ్వానిస్తారా అని అడగ్గా...పిలవడానికి ఆయనేమీ పిల్లడు కాదని వ్యాఖ్యానించారు. పవన్‌ కు ఇన్విటేషన్‌ ఇస్తానని, అది తన బాధ్యత అని అన్నారు. రావడం, రాకపోవడం అన్నది ఆయన ఇష్టమని చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com