తెలంగాణా ప్రభుత్వ ఉద్యోగులకు చల్లని కబురు
- September 10, 2015
రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు 3.14 శాతం డిఎను పెంచాలని నిర్ణయం తీసుకొంది కేసీఆర్ సర్కారు.ఈ నిర్ణయంతో రాష్ట్ర ప్రభుత్వ ఖజనాపై ప్రతి ఏటా సుమారు 300 కోట్ల అదనపు భారం పడనుంది.ప్రస్తుతం 8.908శాతం డిఎను ఇస్తున్నారు.దీన్ని 12.052 శాతానికి పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.రాష్ట్ర ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయం వల్ల మూడున్నర లక్షల మందికి ప్రయోజనం కలుగుతోంది.పెంచిన డిఎను ఈ ఏడాది సెప్టెంబర్ నుండి వేతనాలతో కలిపి ఇవ్వనున్నారు. పెంచిన డిఎను ఈ ఏడాది జనవరి 1వ, తేది నుండి అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.ఈ ఏడాది జనవరి నుండి ఆగష్టు వరకు బకాయిలను ఉద్యోగుల జిపిఎఫ్ ఖాతాల్లో జమచేయనుంది ప్రభుత్వం.ఒకవేళ జిపిఎఫ్ ఖాతాలు లేని ఉద్యోగుల బకాయిలను..స్టేట్ ప్రావిడెంట్ ఫండ్..జనరల్ ఫ్రావిడెంట్ ఫండ్ ఖాతాల్లో జమ చేయనున్నారు. అలాగే పార్ట్ టైం అసిస్టెంట్లు, వీఆర్ ఏ లకు నెలకు వంద రూపాయల వేతనం పెంచుతున్నట్టు ఉత్తర్వ్యులో పేర్కొంది సర్కారు.
తాజా వార్తలు
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్సిఎం
- ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!







