బంపర్ ఆఫర్ ప్రకటించిన ఎయిరిండియా
- January 06, 2017
ప్రముఖ విమానయాన సంస్థ ఎయిరిండియా సంచలన ఆఫర్ ప్రకటించింది. మూణ్నెళ్ల కాలపరిమితిపై టిక్కెట్లు బుక్ చేసుకొనేవారికి రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలులో సెకండ్ ఏసీ టికెట్‌తో సమానంగా విమాన టికెట్‌ను అందిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ధరలు రూ.1080 నుంచి ప్రారంభమవుతాయని పేర్కొంది. ఇది శుక్రవారం నుంచే అందుబాటులోకి వస్తుందని తెలిపింది. జనవరి 6 నుంచి ఏప్రిల్ 10 మధ్య తీసుకున్న టికెట్లతో జనవరి 26 నుంచి ఏప్రిల్ 30 మధ్య ఎప్పుడైనా ప్రయాణించవచ్చని తెలిపింది. ఎయిరిండియా వెబ్‌సైట్‌తో పాటు ఎయిర్‌లైన్ టికెట్ విక్రయ కేంద్రాలు, ట్రావెల్ ఏజెంట్ల వద్ద కూడా ఈ టికెట్లను కొనుగోలు చేసుకోవచ్చని వివరించింది.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్‌లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







