ఏమి ఈ ఘోర కలి!
- January 06, 2017
బ్రెజిల్‌లోని అమెజాన్ ప్రాంతంలో గల ఓ జైల్లో ఘర్షణ జరిగి 33 మంది ఖైదీలు మరణించారు. సరిగ్గా ఐదు రోజుల క్రితం ఇదే దేశంలోని మరో జైల్లో జరిగిన ఘోర దుర్ఘటనలో 56 మంది ఖైదీలు మరణించిన ఘటనను ఇంకా మర్చిపోకముందే ఇప్పుడు మరో దారుణం జరగడం గమనార్హం.
రోరైమా రాష్ట్రంలోని అతిపెద్ద జైల్లో తాజా దుర్ఘటన జరిగింది. బ్రెజిల్ జైళ్ల వ్యవస్థను ఎక్కువగా గ్యాంగులే నియంత్రిస్తుంటాయని, అందువల్ల సమీప భవిష్యత్తులో మరిన్ని ఘర్షణలు చోటుచేసుకోవచ్చని అంటున్నారు. ఇప్పుడు కూడా డ్రగ్స్ గ్యాంగుల మధ్య చెలరేగిన వివాదమే గొడవకు కారణమని తెలుస్తోంది. రెండు వేర్వేరు క్రిమినల్ గ్యాంగులకు చెందిన ఖైదీల మధ్య గొడవ జరిగి, ఒకరినొకరు నరికి చంపుకుంటున్న ఘటనలు అక్కడ తరచు చోటుచేసుకుంటున్నాయి.
తాజా వార్తలు
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!







