'ఖైదీ నంబర్ 150' ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు సర్వం సిద్ధం
- January 07, 2017
సంక్రాంతికి విడుదలయ్యే మెగాస్టార్ చిరంజీవి నటించిన 150వ చిత్రం ఖైదీనెంబర్ 150 ప్రీ రిలీజ్ వేడకలకు ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం చినకాకాని హాయ్‌ల్యాండ్‌లో శనివారం సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకూ జరిగే వేడుకలకు వేదిక నిర్మాణం, బారికేడ్ల పనులు, లైటింగ్, సౌండ్‌సిస్టం పనులు శరవేగంగా చేస్తున్నారు. 15 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ప్రాంగణానికి ఎదురుగుగా ఉన్న ఖాళీ స్థలంలో కూడా పెద్దపెద్ద స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నారు. లక్షమందికి పైగా హాజరుకావచ్చని అంచనా వేస్తున్నారు. వేదిక ప్రాంగణంలో ఎంవీఐపీ, వీవీఐపీ, వీఐపీ ప్రాంగణాలు వేర్వేరుగా ఏర్పాటు చేశారు.
ఇక్కడి ఏర్పాట్లను చిరంజీవి యువత జాతీయ అధ్యక్షుడు రవణం స్వామినాయుడు, రాష్ట్ర అధ్యక్షుడు ప్రసాదరెడ్డి, కోశాధికారి అమిరిశెట్టి వెంకటేశ్వర్లు, తిరుమలశెట్టి మురళీకృష్ణ, కంకణాల శంకర్‌లతో కలిసి పరిశీలించారు. తొమ్మిదేళ్ల తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటించిన 150వ చిత్రం కావటంతో రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక, తమిళనాడు నుంచి కూడా పెద్దసంఖ్యలో అభిమానులు వస్తారని చిరంజీవి యువత జాతీయ అధ్యక్షుడు రవణం స్వామినాయుడు తెలిపారు. మెగాస్టార్ సినిమా పాటలు యూట్యూబ్ ద్వారా విడుదలయ్యాయని ఇప్పటికే అందరూ ఆస్వాదిస్తున్నారన్నారు. రాష్ట్ర కోశాధికారి అమిరిశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఖైదీనెంబర్ 150 సినిమా ఆడియో ఇప్పటికే సూపర్‌హిట్ అయిందని, సినిమా కూడా సరికొత్త రికార్డులు సృష్టిస్తుందన్నారు.
తాజా వార్తలు
- హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం
- కొత్త వాటర్‌ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!
- ఎయిర్ స్పెస్ ను తిరిగి తెరిచిన కువైట్..!!
- కజకిస్తాన్ ప్రధానమంత్రితో సయ్యద్ థెయాజిన్ భేటీ..!!
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్‌తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్









