స్టెప్పులు వేయటమే ఆమె చేసిన తప్పా??
- September 11, 2015
తన అభీష్టానికి భిన్నంగా ప్రవర్తించదనే కారణంతో భార్యకు విడాకులిచ్చాడో భర్త. తాను వద్దన్నా వినకుండా డాన్స్ చేసిందనే సాకుతో వివాహ బంధాన్ని తెంచుకున్నాడు. టీవీలో వస్తున్న తనకు ఇష్టమైన పాటకు డాన్స్ చేయడమే ఆమె చేసిన అపరాధం. అరబ్ దేశం సౌదీ అరేబియాలో ఈ విచిత్ర ఉదంతం వెలుగు చూసింది. భక్తి చానళ్లు తప్ప ఇతర చానళ్లు చూడొద్దని తన భార్యకు సదరు భర్త ఫర్మానా జారీచేశాడు. తన మాట కాదని ముందుకెళ్తే తీవ్రపరిణామాలు ఉంటాయని హెచ్చరించేవాడు. ఒకరోజు భర్త ఇంట్లో లేనప్పుడు భార్య తనకిష్టమైన చానల్ పెట్టుకుని సంగీతాన్ని ఆస్వాదించసాగింది. సంగీతానికి అనుగుణంగా పాదం కలిపింది. భర్త ఇంటికి తిరిగొచ్చేప్పటికి పాటకు అనుగుణంగా డాన్స్ చేస్తున్న భార్య కనపడింది. ఆగ్రహంతో ఊగిపోయిన అతడు వెంటనే భార్యకు తలాక్ చెప్పేశాడు. తన ఆజ్ఞను అతిక్రమించినందుకు విడాడులిచ్చేశాడు. " పెళ్లినాటి ప్రమాణాలను పట్టించుకోకుండా తనను మోసం చేసిందని, ఆమెను క్షమించే ప్రసక్తే లేదని సదరు భర్త చెప్పడం శోచనీయం. అయితే భార్యాభర్తలు వివరాలు, సౌదీ అరేబియాలో వారు ఎక్కడ నివసిస్తున్నారనేది మీడియా వెల్లడించలేదు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్‌లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









