విజయవాడ క్యాంపు కార్యాలయంలోకి ప్రవేశించిన ఏపీ సీఎస్
- September 11, 2015
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్ కృష్ణారావు శుక్రవారం విజయవాడలో తన క్యాంపు కార్యాలయంలోకి ప్రవేశించారు. సీఎం చంద్రబాబు ఇప్పటికే విజయవాడ కేంద్రంగా పాలన సాగిస్తున్న తరుణంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా ఇక్కడికే వచ్చారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలోనే ఆయనకు ప్రత్యేక ఛాంబర్ ఏర్పాటు చేశారు. ఇవాళ ఉదయం ప్రత్యేక పూజలు చేసి తన ఛాంబర్లోకి ప్రవేశించారు. ప్రధాన కార్యదర్శిగా నిత్యం ముఖ్యమంత్రికి అందుబాటులో ఉండాల్సి రావటం, పాలనా పరమైన వ్యవహారాల్లో సంప్రదింపులు చేయాల్సి ఉండటంతో ఆయన కూడా ఇక నుంచి ఎక్కువగా విజయవాడలోనే ఉండాలని నిర్ణయించారు.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







