త్వరలో కృష్ణ,మహేష్ బాబుల కాంబినేషన్ లో మల్టీ స్టారర్ చిత్రం
- September 11, 2015
మనం సినిమా సక్సెస్ తర్వాత ఫ్యామిలీ హీరోలంతా కలసి నటించే చిత్రాలు తెలుగులో ఎక్కువయ్యాయి. ఇప్పటికే పాండవులు-పాండవులు తుమ్మెదలో మంచు ఫ్యామిలీ మెంబర్స్ కలసి నటించగా.. చిరంజీవి 150వ సినిమాలో తమ ఫ్యామిలీ హీరోలంతా కాసేపు కనిపిస్తారని ఇటీవల రామ్ చరణ్ స్పష్టం చేశాడు. ఇక వెంకీ,రానా కలయికలో ఓ సినిమాకు సురేశ్ బాబు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి కూడా.. ఈ తరహా ఫ్యామిలీ స్టారర్ ఒకటి తెరకెక్కే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఈ సినిమాను తానే స్వయంగా నిర్మించాలనుకుంటున్నారట కృష్ణ కొన్నాళ్లుగా మహేశ్ తో కలసి నటించేందుకు మల్టీస్టారర్ కథలు వింటున్నారట కృష్ణ. ఈ నేపథ్యంలో ఓ సీనియర్ దర్శకుడు చెప్పిన కథ దాదాపు ఓకే అయిందట. కూతురి హత్యకు కారకులైన వారిపై ప్రతీకారం తీర్చుకునే సీనియర్ సిటిజన్ గా కృష్ణ కనిపించనుండగా.. ఈ కేసును దర్యాప్తు చేసే పోలీస్ ఆఫీసర్ గా మహేశ్ పాత్ర ఉండనుందట. ఈ కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన కృష్ణ.. ప్రస్తుతం మహేశ్ ను ఒప్పించే ప్రయత్నంలో ఉన్నారట. కృష్ణ, మహేశ్ తో పాటు విజయనిర్మల, రమేశ్ బాబు, సుధీర్ బాబు, మహేశ్ కొడుకు గౌతమ్ కూడా ఈ సినిమాలో ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. సో. మహేశ్ ఓకే చెప్పి డేట్స్ ఇవ్వడమే ఆలస్యం.. ఘట్టమనేని ఫ్యామిలీ స్టారర్ సెట్స్ పైకి వెళ్లనుంది. మరి.. మహేశ్ ఎప్పుడు ఓకే చెపుతాడో చూడాలి..!
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్‌జెట్‌లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!









