తెలంగాణ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ....
- January 09, 2017
న్యూఢిల్లీ: తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. నీటి కేటాయింపుల్లో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ సర్కార్ వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. ట్రిబ్యునల్ తీర్పుతో తెలంగాణకు అన్యాయం జరిగిందని ప్రభుత్వం తరఫున వైద్యనాథన్ వాదనలు వినిపించారు. ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు జరిపేందుకే సెక్షన్ 89ని చట్టంలో చేర్చారని, ట్రిబ్యునల్ దానికి ప్రాధాన్యతలేదని తోసిపుచ్చిందని విన్నవించారు. అయితే ఏపీ, తెలంగాణ మధ్య నీటి వివాదానికి సెక్షన్ 84, ఎఫెక్స్ కౌన్సిల్ ఉన్నాయని వ్యాఖ్యానించిన న్యాయస్థానం పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు పేర్కొంది.అటు ఏపీ విభజన చట్టం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే పరిమితమని, మహారాష్ట్ర, కర్నాటకలు వాదించాయి.
తాజా వార్తలు
- విజయ్–కమల్ పార్టీలకు గుర్తులు ఖరారు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం..
- సీఎం రేవంత్‌ను కలిసిన ఏపీ మంత్రి లోకేశ్
- ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు
- WHO నుంచి అధికారికంగా వైదొలగనున్న అమెరికా
- రమదాన్ సందర్భంగా లౌడ్ స్పీకర్లపై సౌదీ నిషేధం..!!
- లైసెన్స్ లేకుండా ఫుడ్ బిజినెస్..హౌజ్ సీజ్..!!
- చౌకగా ట్రిప్.. ఆరెంజ్ కార్డ్ ఫీజులను తగ్గించిన ఒమన్..!!
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ తో సౌదీ అరేబియా ఒప్పందం..!!
- BBQ పొగ హానికరమా?







