వాణిజ్య ప్రాంతాల్లో బహుళార్ధక పార్కింగ్ సదుపాయాల నిర్మాణాలు

- January 09, 2017 , by Maagulf
వాణిజ్య ప్రాంతాల్లో బహుళార్ధక పార్కింగ్ సదుపాయాల నిర్మాణాలు

మస్కట్ : నగరంలో రద్దీ మరియు పార్కింగ్ అవసరాలను తీర్చేందుకు  మస్కట్ మున్సిపాలిటీ బహుళ అంతస్తుల పార్కింగ్ సౌకర్యాలను నిర్మించే ప్రక్రియలో నిమగ్నమై ఉంది. ఇందుకోసం ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించి ట్రాఫిక్ ఎక్కువగా ఉండే సమయాలలో ప్రధానంగా వాణిజ్య ప్రాంతాల్లో ఉక్కిరిబిక్కిరి అయ్యేలా పరిస్థితి ఉంది. దీనితో నగరం అంతటా 10,000 పైగా పార్కింగ్ స్లాట్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలియచేస్తూ  నగరంలో వాహనాలు మరియు కార్ల సంఖ్య పెరుగుదల నేపథ్యంలో అందుకు  తగ్గట్టుగా పార్కింగ్ అవసరం గ్రహించి,  మస్కట్ మున్సిపాలిటీలో పార్కింగ్ మీటర్ చెల్లింపుల  అసిస్టెంట్ డైరెక్టర్, సూపర్వైజర్ ఖలీద్ మహ్మూద్ ఆలీ అల్ హాసిని తెలిపారు. వ్యాపార కార్యకలాపాలు ఎక్కువగా  జరిగే ప్రాంతాల్లో బహుళ అంతస్తుల భవన పార్కింగ్ సౌకర్యాలు ట్రాఫిక్ రద్దీని ఎదుర్కోవడానికి  మరింత మెరుగైన ప్రత్యామ్నాయాలుగా ఉన్నాయని  చెప్పారు. ఈ ప్రాంతాలలో  ఏ  విధమైన భూములు దొరకనందున బహుళ అంతస్తుల భవన పార్కింగ్ పార్కింగ్ విభాగాలుగా మార్చవచ్చును కాబట్టి బహుళ అంతస్తుల పార్కింగ్ సౌకర్యాలు మాత్రమే ఇక్కడ  ప్రత్యామ్నాయమని ఆల్ హాసిని  చెప్పారు.ఒక బహుళ అంతస్తుల పార్కింగ్ సౌకర్యం చేసే ప్రదేశంలో 50 కార్లు మాత్రమే పార్కింగ్ చేసే అవకాశం ఉంటుందని ఇటువంటి వాణిజ్య ప్రాంతాల్లో బహుళ అంతస్తుల పార్కింగ్ సౌకర్యాలు నిర్మించడమే  ఒక పరిష్కారం. ఒక బహుళ అంతస్తుల సౌకర్యం నిర్మాణం చేసుకోవడం వలన ఎక్కువ మొత్తంలో పార్కింగ్ ను అదే స్థలంలో ఏర్పాటుచేసుకోవచ్చని ఉదాహరణకు, సుమారు 300 నుంచి 400 కార్లు పార్కింగ్ సదుపాయ ప్రయోజనం పొందవచ్చని అన్నారు. రాయల్ హాస్పిటల్ ఇటీవల బహుళ అంతస్తుల పార్కింగ్ భవనం ప్రారంభోత్సవం జరిపిందని తద్వారా  487 వాహనాలు ఇక్కడ కల్పించబడిందని వివరించారు..

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com