నా కస్టమర్లందరు నవ్వాలి ... అదే నాకు కావాలి!

- September 11, 2015 , by Maagulf
నా కస్టమర్లందరు నవ్వాలి ... అదే నాకు కావాలి!

ఇరవై రెండు సంవత్సరాల మొహమ్మద్ మనన్ సులాల్ కి కార్లంటే మహా ప్రేమ! కానీ ఇతనికి కారులేదు, కనీసం లైసెన్స్ కూడా లేదు; ఇవేవీ లేకపోవడం అతన్ని కార్ల ను ఇష్ట పడడాన్నించి ఆపలేవు. చిన్నవి, పెద్దవి; పసుపు లేదా ఎరుపు ఏ కారైన సరే... అతనికి ఇష్టమే. నీలం రంగు టీ షర్టు, ఫాంటు వేసుకుని, నవ్వు మొహంతో ఉండే సులాల్  కి వారంలో అరురోజులు పనిచేయడం మిగతా వారిలాగ తలనొప్పి వ్యవహారం కాదు. ఉదయం 11 గంటలకు మొదలయ్యే ఇతని పని రాత్రి 10 30 వరకు కొనసాగుతుంది. ఇంతా చేసి ఈయన ఎం చేస్తాడో అనుకుంటున్నారా?  సులాల్ కార్లను బాగుచేయడు...వాటిని కడుగుతాడు! ఇంచుమించు రోజుకు 14 నుండి 15 కార్లను;

సులాల్ కి సంబంధించినంత వరకు, కస్టమర్లతో మాట్లాడడం భలే సంతోషానిస్తుంది. దుమ్ముపట్టిన కార్లను శుభ్రపరచి తళతళ లాడేలా తిరిగి ఇచ్చేటపుడు వారి నవ్వు ఉత్సాహాన్నిస్తుంది. రోజంతా ఇతను గడిపే ఇతని ‘ఆఫీసు’, మెర్కాతో మాల్ కింద నున్న అండర్గ్రౌండ్ కార్ పార్కింగ్! ఇక్కడ చాలా వేడిగా ఉంటుంది; “అలాంటప్పుడు మేము చిన్న బ్రేక్ తీసుకుంటాం, బోలెడు నీరు తాగుతాం; మాకు అలవాటైపోయింది, అందుకే నాకు శీతాకాలమంటే ఇష్టం” అని అంటాడు. కేవలం 17 సంవత్సరాల వయసులో, తన తల్లిదండ్రులను, అక్కని వదిలి ఉద్యోగం కోసం దుబాయికి వచ్చిన ఈ పాలబుగ్గల పసివాడికి, ఇక్కడ ఉద్యోగలేమీ వరసకట్టి రాలేదు; కానీ కార్లే అతనికి తోవ చూపించాయి, తరవాత తన అభిరుచిగా మారాయి. ఇలా మాట్లాడుతూనే నా కారును మెరిపించిన అతనికి 20 దిర్హం నోటు ఇస్తే, నావైపు చూసి నవ్విన అతను "ఇదే మేడమ్... నాకు కావాల్సిందీ, నాకు ఇష్టమైనదీ” అంటూ నా నవ్వు మొహాన్ని చూపించాడు ఆ పట్నమొచ్చిన బాటసారి!

 

--సి.శ్రీ(దుబాయ్

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com