మక్కా గ్రాండ్ మసీదు పై కూలిన క్రేన్ - 107 కు చేరిన మృతుల సంఖ్య
- September 11, 2015
ఇస్లామీయుల పవిత్ర నగరమైన మక్కా లో నిన్న రాత్రి గ్రాండ్ మసీదు పై క్రేన్ పతనమవడం వల్ల కాబా చుట్టూ చేరి ప్రార్ధనలు జరుపుతున్న, మౌంట్ శాఫా మరియు మార్వాల మధ్య ప్రయాణిస్తున్న భక్తులపై మసీదు పైభాగం కూలిపోయిన సంఘటనలో మృతుల సంఖ్య 107 కు పెరగగా, 200 మంది గాయపడ్డారు. ఈ శుక్రవారం మక్కా రీజియన్ గవర్నర్ - ప్రిన్స్ ఖలేద్ అల్ ఫైజల్ హుటాహుటిన మసీదుకు తరలి వెళ్ళి, సంఘటనపై దర్యాప్తుకు ఆదేశించారు. తీవ్రమైన గాలులు, భారీ వర్షపాతం వలన ఈ ప్రాంతంలో చెట్లు సమూలంగా పెకిలించబడ్దాయని, క్రేన్‌లు దెబ్బతిన్నాయని, మృతి చెందిన వారిని, గాయపడ్డ ప్రతి ఒక్కరినీ ఆసు పత్రులకు తరలించామని సివిల్ డిఫెన్స్ ఆధారిటీ డైరక్టర్ జనరల్ సులేమాన్ అల్ అమీర్ తెలిపారు. గాయపడినవారు ఏ దేశస్తులు అనే విషయం తెలియరానప్పటికీ, వారి లో 15 మంది ఇరానీయులని ప్రకటించారు. శుక్రవారం నాటికి రాజ్యంలోకి 8,00,000 మంది హజ్ యాత్రీకులు వచ్చి ఉన్నారని అదికారులు తెలిపారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







