ఐఆర్సీటీసీ భారత్ దర్శన్ యాత్ర..
- January 11, 2017
'భారత్ దర్శన్' పేరుతో ఇండియన్ రైల్వే క్యాటరింగ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) ఆధ్వర్యంలో హైద్రాబాద్ నుంచి కొచ్చిన్‌కు విమాన యాత్ర ప్రవేశపెడుతున్నట్టు ఐఆర్సీటీసీ డిప్యూటీ జనరల్ మేనేజర్ సంజీవయ్య తెలిపారు. సికింద్రాబాద్ ఐఆర్సీటీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ హైద్రాబాద్ శంషాబాద్ నుంచి కొచ్చిన్‌కు విమాన యాత్ర మొదటి ట్రిప్ ఫిబ్రవరిలో, రెండో ట్రిప్ మార్చిలో యాత్ర కొనసాగుతుందన్నారు. మొదటి ట్రిప్ :
హైద్రాబాద్ శంషాబాద్ నుంచి ఫిబ్రవరి 23న ఉదయం 8.55 గంటలకు బయల్దేరి 10.25కు కొచ్చిన్‌కు చేరుకుంటుంది.
కొచ్చిన్ ఎయిర్‌పోర్టుల నుంచి ఫిబ్రవరి 29న రాత్రి 9. 25 గంటలకు బయల్దేరి హైద్రాబాద్‌కు రాత్రి 10.25కు చేరుకుంటుంది.
రెండో ట్రిప్ :
హైద్రాబాద్ శంషాబాద్ నుంచి మార్చి 10న ఉదయం 8.55 గంటలకు బయల్దేరుతుంది.
కొచ్చిన్ నుంచి హైద్రాబాద్‌కు మార్చి 16న రాత్రి 9.25 గంటలకు బయల్దేరి హైద్రాబాద్‌కు 10.25కు చేరుకుంటుంది.
చూడాల్సిన ప్రదేశాలు:
ఐఆర్సీటీసీ కల్పిస్తున్న విమాన యాత్రలో భాగంగా ఎర్నాకులం, మున్నూర్, టెక్కడి, కుమర్కుం, కొచ్చిన్, శ్రీనగర్, గోవా మీర్మార్ బీచ్, పాత గోవా బీచ్, మంగీషా దేవాలయం, దోనాపౌలా బీచ్, ఆగుడా, కండోలిం బీచ్, బాగా బీచ్వంటి ప్రదేశాలను చూడొచ్చు.
చార్జీల వివరాలు:
ఒక్కరికి -రూ.
23,328 - 00
ఇద్దరికి - రూ. 18,404 - 00
ముగ్గురికి -రూ. 18124 - 00
చిన్నపిల్లలు - 2 ఏళ్ల నుంచి 11 ఏళ్ల వయసువారికి రూ. 17,672 చార్జీలు వసూలు చేస్తారు.
వివరాల కోసం ఐఆర్సీటీసీ 040-27702407/ 27800580, బేగంపేట్ ఫోన్ నెంబరు - 040 23400606 నెంబర్లకు సంప్రదించాలని కోరారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!







