అమెజాన్ సంస్థ బేషరతుగా క్షమాపణలు చెప్పాలి..
- January 11, 2017
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌కు భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. భారత ప్రజలకు క్షమాపణ చెప్తారా? లేక వీసా రద్దు చేయమంటారా? అంటూ ఆమె హెచ్చరిక చేశారు.
భారత జాతీయ పతాకాన్ని ముద్రించిన డోర్ మ్యాట్‌లను ఈ సంస్థ విక్రయిస్తోంది. వీటిని తక్షణం వాటిని మార్కెట్ నుంచి వెనక్కు తీసుకోవాలని, లేకుంటే ఇక్కడ ఆ సంస్థ ప్రతినిధులందరి వీసాలనూ రద్దు చేస్తామని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.
ఈ మేరకు ఆమె తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ పెడుతూ, "అమెజాన్ సంస్థ బేషరతుగా క్షమాపణలు చెప్పాలి. మా దేశ పతాకం ఉన్న అన్ని రకాల ప్రొడక్టుల విక్రయాలను నిలిపివేయాలి. ఈ పని చేయకుంటే, అమెజాన్ అధికారులెవ్వరికీ వీసాలు జారీ చేయం.
గతంలో ఇచ్చిన వీసాలనూ రద్దు చేస్తాం" అన్నారు.
కాగా, సుష్మా స్వరాజ్ ట్వీట్ చేసిన నాలుగు గంటల్లోనే అమెజాన్ కేటలాగ్ నుంచి అభ్యంతరకర ప్రొడక్టులను ఆ సంస్థ తొలగించింది. సెర్చ్ రిజల్ట్స్ నుంచి కూడా వాటిని తొలగించింది. ఈ ప్రొడక్టులను తాము డైరెక్టుగా విక్రయించడం లేదని, వాటిని థర్డ్ పార్టీ సెల్లర్స్ తమ వెబ్‌సైట్ మాధ్యమంగా విక్రయిస్తున్నారని వివరణ ఇచ్చింది.
తాజా వార్తలు
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్‌లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన







