ఈ నెల 23న ప్రముఖ నటి రాధిక కుమార్తె నిశ్చితార్థం
- September 11, 2015
ప్రముఖ నటి, రాడాన్ సంస్థ అధినేత్రి రాధిక త్వరలో అత్తయ్య హోదా పొందనున్నారు. ఆమె కూతురు రెయాన్ వివాహ నిశ్చితార్థం ఈ నెల 23 న చెన్నైలో జరగనుంది. ఈ విషయాన్ని రాధికనే స్వయంగా ట్విట్ చేసింది. తన కుమార్తెకు పెళ్లి కుదిరిందని అందరూ ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేసింది. ఇంగ్లాండ్‌లోని లిట్స్ విశ్వవిద్యాలయంలో క్రీడారంగం విభాగంలో ఎంఏ చదివిన రెయాన్ ప్రస్తుతం రాడాన్ సంస్థకు సహాయ నిర్వాహకురాలిగా వ్యవహరిస్తోంది. రెయాన్కు క్రికెట్ క్రీడాకారుడు అభిమన్యు మిథున్‌కు ఈ నెల 23 న చెన్నైలో వివాహనిశ్చితార్థం జరపనున్నట్లు నటుడు, నడిగర్ సంఘం అధ్యక్షుడు, ఎస్ఎంకే నేత శరత్ కుమార్ వెల్లడించారు. వివాహ తేదీని నిశ్చితార్థం రోజు వెల్లడించనున్నట్లు శరత్‌కుమార్ తెలిపారు. కాగా అభిమన్యు మిథున్ భారత క్రికెట్ జట్టులో క్రీడాకారుడు. అతడు మంచి బౌలర్. ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిధ్యం వహించాడు. వీరిద్దరూ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారని, ఇరు కుటుంబాలు వీరి ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. దీంతో త్వరలో వీరి వివాహాన్ని ఘనంగా జరిపేందుకు ఇరు కుటుంబ సభ్యులు సన్నాహాలు చేస్తున్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







