కతార్ లో నేడు మరింత వర్షపాతం
- September 12, 2015
నేడు కతార్ లో కొన్ని ప్రాంతాలలో మరింత వర్షపాతం కురిసే అవకాశముండగా, దోహాలో మాత్రం వాతావరణం పొడిగా, ఎండగా ఉంటుందని దేశ వాతావరణ శాఖ తెలిపింది. నిన్న దేశంలో ఉరుములు, ఇసుక దుమారాలు, తీవ్ర గాలులతో కూడిన వర్షపాతం నమోదైన విషయం తెలిసిందే! ఇక నేడు, వాతావరణం మబ్బు పట్టి, నిస్తేజంగా ఉంటుందని, మధ్యాహ్నం నుంచి కొన్ని ప్రాంతాలలో ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వారు తెలిపారు. ఉత్తర ప్రాంతం లోని అల్ రువైశ్ లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు, మరియు దుఖాన్, అబూ సమ్రా లలో సాధారణ వర్షాలు కురుస్తాయని; దోహా, అల్ ఖోర్ మరియు మెస్సైద్ లలో వాతావరణం పొడిగా, ఆహ్లాదకరంగా ఉంటుందని వారి అంచనా. ఇక దేశంలోని వివిధ ప్రాంతాలలో ఉష్ణోగ్రత నిన్నటి మాదిరిగానే, కనీస ఉష్ణోగ్రత 29 డిగ్రీలు, గరిష్ట ఉష్ణోగ్రత 41 డిగ్రీలుగా ఉంటుంది. దోహాలో ఉష్ణోగ్రత 32 నుండి 39 డిగ్రీల సెంటిగ్రెడు మధ్య ఉంటుందని కూడా శాఖ అధికారులు తెలిపారు.
--వి.రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,కతార్)
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







