'జై.. లవ..కుశ..' గా రానున్న ఎన్టీఆర్‌.!

- January 15, 2017 , by Maagulf
'జై.. లవ..కుశ..' గా రానున్న ఎన్టీఆర్‌.!

ఎన్టీఆర్‌ కొత్త సినిమా ప్రకటించిన దగ్గరి నుంచి విడుదలయ్యే వరకూ అభిమానుల్లో చర్చ నడుస్తూనే ఉంటుంది. తమ అభిమాన కథానాయకుడి చిత్ర విశేషాలను తెలుసుకునేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు. ఎన్టీఆర్‌ ప్రస్తుతం బాబి దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా సీకే మురళీధరన్‌ను చిత్రబృందం ఇటీవల ఎంపిక చేసింది. గతంలో ఈయన బాలీవుడ్‌ చిత్రాలు 'త్రీ ఇడియట్స్‌', 'పీకే', 'మొహెంజొదారో' చిత్రాలకు పనిచేశారు. ఇక ఎన్టీఆర్‌ తాజా చిత్రానికి 'జై.. లవ..కుశ..' అనే పేరు పరిశీలనలో ఉంది. నందమూరి తారకరామారావు ఆర్ట్స్‌ బ్యానర్‌పై కల్యాణ్‌రామ్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్‌ తన సినీ కెరీర్‌లో తొలిసారి త్రిపాత్రాభినయం చేస్తుండటం విశేషం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com