ఐసిస్ పై పోరాటానికి... తుపాకులు చేతపట్టిన మహిళలు
- January 15, 2017
బాంబు దాడులతో ప్రపంచాన్ని వణికిస్తున్న ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులపై పోరాటానికి మహిళలు తుపాకులు చేతబట్టారు. ఉత్తర ఆఫ్గనిస్థాన్ జాజ్జాన్ ప్రావిన్స్‌లో ఐఎస్, తాలిబాన్ ముష్కరుల దాడుల్లో పలు కుటుంబాలకు చెందిన వారు మృతి చెందారు. దీంతో కుటుంబ సభ్యులను కోల్పోయిన 20 నుంచి 80 ఏళ్ళ మహిళలు తమను తాము కాపాడుకోవడంతో పాటు ఐఎస్ఐఎస్పై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించారు. స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్ళి తమకు ఆయుధాలు కావాలని కోరారు. ఇవ్వని పక్షంలో సామూహికంగా ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు.
దీంతో దిగివచ్చిన స్థానిక పోలీస్ అధికారి వారికి తుపాకులు, బులెట్లు ఇచ్చారు. కాగా ప్రభుత్వ అధికారులు మాత్రం దీన్ని సమర్థించడం లేదు.
ఆసక్తి ఉన్న మహిళలు ఆర్మీలో చేరితే శిక్షణ ఇస్తామంటున్నారు. అయితే ఆర్మీ తమ కుటుంబ సభ్యులను రక్షించలేకపోయిందని ఆ మహిళలు అంటున్నారు. ఎలాంటి శిక్షణ లేకపోయినా తమను తాము కాపాడుకుంటామని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









