హైదరాబాద్ లో రూ.10 లక్షల సొత్తుతో కారు డ్రైవర్ పరారి
- September 12, 2015
రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విదేశాల నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తులు మోసపోయారు. వారిద్దరినీ బురిడీ కొట్టించి రూ.10 లక్షల సొత్తుతో కారు డ్రైవర్ పరారయ్యాడు. వివరాల్లోకి వెళ్తే.. నిజామాబాద్ జిల్లా బాన్సువాడకు చెందిన ఖలీద్, బోధన్‌కు చెందిన నాసర్ నాలుగేళ్లుగా కువైట్‌లో ఉంటున్నారు. వారిద్దరూ శుక్రవారం సాయంత్రం విమానంలో హైదరాబాద్ చేరుకున్నారు. ఎయిర్‌పోర్టు నుంచి ఎంజీబీఎస్‌కు వెళ్లేందుకు వారిద్దరూ ఓ కారును మాట్లాడుకున్నారు. అందులో ఎక్కి కొంతదూరం వెళ్లాక...'ఎయిర్‌పోర్టు టాక్సీ స్టాండు వద్ద మీ జేబులో నుంచి కొన్ని కాగితాలు పడిపోవటం చూశాను. అవి పాస్‌పోర్టు, వీసాలాగానే ఉన్నాయి...' అంటూ కారు డ్రైవర్ వారిని తికమకపెట్టాడు. అతని మాటలు నిజమేననుకున్న ఖలీద్, నాసర్ కారును వెనక్కి తీసుకెళ్లాలని కోరారు. ఎయిర్‌పోర్టు టాక్సీ స్టాండు వద్దకు వెళ్లాక వారిద్దరూ కిందికి దిగి వెతుకులాట మొదలుపెట్టారు. వారు ఏమరుపాటుగా ఉన్న సమయాన్ని గమనించి కారు డ్రైవర్ వారి లగేజీతో మాయమయ్యాడు. మోస పోయామని గ్రహించిన బాధితులు ఎయిర్‌పోర్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ బ్యాగుల్లో 450 కువైట్ దినార్లు, 10 సెల్ఫోన్లు,5 తులాల బంగారు ఆభరణాలు తదితర రూ.10 లక్షల విలువైన సొత్తు ఉందని వారు పేర్కొన్నారు. అయితే, శనివారం సాయంత్రం వరకు ఆ కేసు దర్యాప్తు ప్రారంభం కాలేదనే సమాచారం మేరకు వారు జిల్లాకు చెందిన మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. ఆయన జోక్యం చేసుకోవటంతో పోలీసులు కేసు దర్యాప్తు ముమ్మరం చేశారు.
తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్‌లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్‌లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







