యెమన్ లో సంక్షోభ నివారణకే బహ్రైన్ దృఢ నిశ్చయం
- September 12, 2015
యెమన్ లో ప్రభుత్వ పునరుద్ధరణకై సౌదీ నేతృత్వంలో నడుస్తున్న కూటమి
'ఆపరేషన్ రెస్టోరింగ్ హోప్' కు తమ నిరంతర మద్దతు కొనసాగిస్తామని, బహ్రైన్ ప్రకటించింది. హిజ్ మాజెస్టీ కింగ్ హమాద్, అబుధాబీ యువరాజు మరియు యూ. ఏ. ఈ. సాయుధ దళాల డేప్యూటీ సుప్రీం కమాండర్ తో మొహమ్మెడ్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ తో కలసి, యెమన్ మరీబ్ ప్రావి న్స్ లో గత శుక్రవారం జరిగిన ఆయుధాగారం పై
మిస్సైల్ దాడిలో జరిగిన మరణించిన GCC సైనికుల ప్రత్యేక సంస్మరణ పాల్గొన్నారు.
ఈ కార్యక్రమం షేక్ జాయెద్ గ్రాండ్ మాస్క్ లో జరిగింది.
మొత్తం 45 మంది యూ. ఏ. ఈ., 10 మంది సౌదీ మరియు ఐదుగురు బహ్రైన్ సైనికులు ఈ ఘటనలో మరణించిన సంగతి విదితమే; ఈ వీరుల బలిదానం, చరిత్రాత్మిక ఐక్యతకు, సంఘీభావానికీ చిహ్నమని అధినేత వ్యాఖ్యానించారు. అరబ్ ప్రపంచంలో సోదరదేశాలు ఎదుర్కొంటున్న సవాళ్లను ఎదుర్కోవడానికి భుజాన్నందించే తమ నిబద్ధతను స్పష్టం చేశారు. డేప్యూటీ కింగ్ హిజ్ రాయల్ హైనెస్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమాద్ అల్ ఖలీఫా కూడా కూడా ఆ ఆపరేషన్ కు తమ పూర్తి మద్దతును తెలుపుతూ, అరబ్ మరియు ప్రాంతీయ దేశాల పట్ల సాయుధ దళాల కృషిని శ్లాఘించారు. ఈయన రిఫ్ఫా లోని షేక్ ఈ సా మసీదులో జరిగిన గతించిన వారి అంత్యక్రియలలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం లో ప్రభుత్వఉన్నత అధికారులు, మంత్రులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న మసీదులలో కూడా ఈ విధమైన ప్రార్ధనలు జరిగాయి.
--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రైన్)
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







