ముత్తూట్‌ ఫైనాన్స్ దొంగల అరెస్ట్

- January 16, 2017 , by Maagulf
ముత్తూట్‌ ఫైనాన్స్ దొంగల అరెస్ట్

సంగారెడ్డి జిల్లాలోని రామచంద్రాపురం ముత్తూట్‌ ఫైనాన్స్‌ దోపిడీ కేసు నిందితులను పోలీసులు అరెస్టుచేశారు. ఈ కేసులో ఐదుగురు నిందితులు సైబరాబాద్‌ పోలీసులకు పట్టుబడ్డారు.  నిందితుల నుంచి మూడున్నర కిలోల బంగారం, .5లక్షల నగదు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సీబీఐ అధికారులమంటూ డిసెంబర్‌ 28న రామచంద్రాపురంలోని ముత్తూట్‌ ఫైనాన్స్‌ సంస్థలోకి చొరబడి సుమారు 40కిలోల బంగారం దోచుకెళ్లిన సంఘటన పెను సంచలనం సృష్టించింది. అయితే, తొమ్మిది మంది నిందితుల్లో పోలీసులు ఐదుగురిని అరెస్టుచేయగా, మరో నలుగురు నిందితుల కోసం ముమ్మరగాలింపు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు. పట్టుబడిన నిందితులు కర్ణాటక, ముంబయి వాసులుగా గుర్తించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com