ఆద్యంతం వినోదాత్మకం...

- January 17, 2017 , by Maagulf
ఆద్యంతం వినోదాత్మకం...

రాజ్‌ తరుణ్‌, అను ఇమ్మాన్యుయల్‌ జంటగా వంశీ కృష్ణ దర్శకత్వంలో 
ఏ టీవీ సమర్పణలో ఏ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఇండియా ప్రై.లి పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న చిత్రం 'కిట్టు ఉన్నాడు జాగ్రత్త'. విడుదలకు సిద్ధమైన ఈ చిత్రం గురించి నిర్మాత రామబ్రహ్మం సుంకర చెబుతూ, ' 'ఈడోరకం-ఆడోరకం' తర్వాత మా బ్యానర్‌లో రాజ్‌తరుణ్‌ నటిస్తున్న చిత్రమిది. హిలేరియస్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. ఇందులో రాజ్‌ తరుణ్‌ కుక్కలను కిడ్నాప్‌ చేసే యువకుడి పాత్రలో కనిపిస్తాడు. డబ్బు కోసం కుక్కులను కిడ్నాప్‌ చేయడమే కాకుండా ప్రేమ కోసం ఏం చేశాడనేది తెరపైనే చూడాలి. అనేక మలుపులతో, థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌తో ఆసక్తికరంగా సాగుతుంది.
ఇటీవల 'గౌతమిపుత్ర శాతకర్ణి' వంటి హిస్టారికల్‌ చిత్రానికి సంభాషణలు రాసి మెప్పించిన సాయిమాధవ్‌ ఈ సినిమాకు ఫన్నీ డైలాగులు అందించారు. బాలీవుడ్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌ సోదరుడు అర్భాజ్‌ ఖాన్‌ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించడం విశేషం. అనూప్‌ రూబెన్స్‌ అద్భుతమైన బాణీలను సమకూర్చారు. సినిమాను ఫిబ్రవరి 17న విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్నాం' అని అన్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com