పడవ మునక మధ్యధరాలో...
- January 18, 2017
- 180 మంది గల్లంతు
రోమ్ : మధ్యధరా సముద్రంలో శనివారం రాత్రి సంభవించిన వలస ప్రయాణీకుల పడవ మునిగిన ప్రమాదంలో నలుగురు మరణించారని, మరో 180 మందికి పైగా గల్లంతయ్యారని ఐరాస అంతర్జాతీయ వలస వ్యవహారాల సంస్థ (ఐఓఎం) వెల్లడించింది. ఈ ప్రమాదం నుండి ప్రాణాలతో బయటపడి ఇటలీ రేవుపట్టణం త్రపానీకి చేరుకున్న నలుగురు ప్రయాణికుల ద్వారా ఈ సమాచారం తెలిసిందని ఐరాస వివరించింది. గల్లంతయిన వారంతా మరణించినట్లు భావిస్తున్నామని వారు అధికారులకు వివరించారు. ప్రాణాలతో బయటపడిన వారిలో ఇద్దరు ఎరిత్రియన్లు, ఇద్దరు ఇథియోపియన్లు వున్నారని వీరు సోమవారం సాయంత్రం త్రపాని తీరానికి చేరుకున్నారని ఐఓఎం ప్రతినిదులు వివరించారు.
శుక్రవారం సాయంత్రం లిబియా తీరం నుండి కిక్కిరిసిన ప్రయాణికులతో ఈ చెక్కపడవ బయల్దేరిందని, వీరంతా తూర్పు ఆఫ్రికా ప్రాంతానికిచెందిన వారేనని తెలుస్తోంది. ప్రయాణం ప్రారంభించిన ఐదు గంటల తరువాత పడవ ఇంజన్ చెడిపోయి నెమ్మదిగా నీరు ప్రవేశించడం ప్రారంభించిందని, పడవ నెమ్మదిగా మునిగిపోవడంతో జలసమాధి అయిన వారి సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయని ఐఓఎం ప్రతినిదులు చెప్పారు. మునిగిపోయిన వారు కొన్ని గంటలపాటు నీటిలో వుండిపోయారని, శనివారం నాడు లిబియా తీరానికి 30 నాటికల్ మైళ్ల దూరంలో ఫ్రాన్స్‌కు చెందిన ఒక బోటు వారిని రక్షించి మరో నౌకలోకి మార్చిందని వివరించారు. నార్వేజియన్ కోస్ట్‌గార్డ్‌కు చెందిన ఈ నౌక సోమవారం సాయంత్రం నలుగురు సజీవులతో త్రపానీకి చేరుకుందన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







