మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్...
- January 17, 2017
గోపీచంద్, హన్సిక, కేథరిన్ థ్రెస్సా హీరోహీరోయిన్లుగా, సంపత్ నంది దర్శకత్వంలో శ్రీ బాలాజీ సినీ మీడియా పతాకంపై జె.భగవాన్, జె.పుల్లారావు సంయుక్తంగా ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్రీకరణ చివరి దశకు చేరుకున్న ఈ చిత్రం గురించి నిర్మాతలు మాట్లాడుతూ, 'థారులాండ్, హైదరాబాద్‌లో మూడు షెడ్యూల్స్ పూర్తయ్యాయి. మంగళవారం నుంచి ప్రారంభమైన చివరి షెడ్యూల్ ఫిబ్రవరి 20 వరకు జరుగుతుంది. ఇందులో గోపీచంద్, హన్సిక, కేథరిన్ థ్రెస్సాలపై కొన్ని ముఖ్యమైన సన్నివేశాలతోపాటు పతాక సన్నివేశాలను చిత్రీకరించనున్నాం. దీంతో షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. రామ్-లక్ష్మణ్‌ల అధ్వర్యంలో చిత్రీకరించనున్న యాక్షన్ సీన్స్ సినిమాకు హైలైట్‌గా నిలువనున్నాయి.
దర్శకుడు సంపత్‌నంది పోరాట సన్నివేశాలతోపాటు ఎమోషనల్ సీన్స్‌ను హ్యాండిల్ చేసే విధానం, ఆ సన్నివేశాల్ని మా సినిమాటోగ్రాఫర్ సౌందర్ రాజన్ కెమెరాతో బంధించిన తీరు ప్రేక్షకులకు కనువిందు చేస్తుంది. విశేషంగా అలరిస్తుంది. ఈ సినిమాలో గోపీచంద్ స్టయిలీష్‌గా కనిపిస్తారు. సంపత్ నంది మార్క్, పవర్‌ఫుల్ టైటిల్‌తోపాటు గోపీచంద్ స్టయిలీష్ లుక్‌ను త్వరలో విడుదల చేస్తాం.
అత్యుత్తమ సాంకేతిక నైపుణ్యంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం మా బ్యానర్ విలువను పెంచుతుంది. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈచిత్రాన్ని వేసవిలో విడుదల చేస్తాం' అని అన్నారు.
తాజా వార్తలు
- Mohammed bin Rashid Leadership Forum: Leaders and experts outline priorities for Dubai’s next phase of growth
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!







