పడవ మునక మధ్యధరాలో...

- January 18, 2017 , by Maagulf
పడవ మునక మధ్యధరాలో...

- 180 మంది గల్లంతు 
రోమ్‌ : మధ్యధరా సముద్రంలో శనివారం రాత్రి సంభవించిన వలస ప్రయాణీకుల పడవ మునిగిన ప్రమాదంలో నలుగురు మరణించారని, మరో 180 మందికి పైగా గల్లంతయ్యారని ఐరాస అంతర్జాతీయ వలస వ్యవహారాల సంస్థ (ఐఓఎం) వెల్లడించింది. ఈ ప్రమాదం నుండి ప్రాణాలతో బయటపడి ఇటలీ రేవుపట్టణం త్రపానీకి చేరుకున్న నలుగురు ప్రయాణికుల ద్వారా ఈ సమాచారం తెలిసిందని ఐరాస వివరించింది. గల్లంతయిన వారంతా మరణించినట్లు భావిస్తున్నామని వారు అధికారులకు వివరించారు. ప్రాణాలతో బయటపడిన వారిలో ఇద్దరు ఎరిత్రియన్లు, ఇద్దరు ఇథియోపియన్లు వున్నారని వీరు సోమవారం సాయంత్రం త్రపాని తీరానికి చేరుకున్నారని ఐఓఎం ప్రతినిదులు వివరించారు.
శుక్రవారం సాయంత్రం లిబియా తీరం నుండి కిక్కిరిసిన ప్రయాణికులతో ఈ చెక్కపడవ బయల్దేరిందని, వీరంతా తూర్పు ఆఫ్రికా ప్రాంతానికిచెందిన వారేనని తెలుస్తోంది. ప్రయాణం ప్రారంభించిన ఐదు గంటల తరువాత పడవ ఇంజన్‌ చెడిపోయి నెమ్మదిగా నీరు ప్రవేశించడం ప్రారంభించిందని, పడవ నెమ్మదిగా మునిగిపోవడంతో జలసమాధి అయిన వారి సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయని ఐఓఎం ప్రతినిదులు చెప్పారు. మునిగిపోయిన వారు కొన్ని గంటలపాటు నీటిలో వుండిపోయారని, శనివారం నాడు లిబియా తీరానికి 30 నాటికల్‌ మైళ్ల దూరంలో ఫ్రాన్స్‌కు చెందిన ఒక బోటు వారిని రక్షించి మరో నౌకలోకి మార్చిందని వివరించారు. నార్వేజియన్‌ కోస్ట్‌గార్డ్‌కు చెందిన ఈ నౌక సోమవారం సాయంత్రం నలుగురు సజీవులతో త్రపానీకి చేరుకుందన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com