ఆద్యంతం వినోదాత్మకం...
- January 17, 2017
రాజ్ తరుణ్, అను ఇమ్మాన్యుయల్ జంటగా వంశీ కృష్ణ దర్శకత్వంలో
ఏ టీవీ సమర్పణలో ఏ.కె.ఎంటర్టైన్మెంట్స్ ఇండియా ప్రై.లి పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న చిత్రం 'కిట్టు ఉన్నాడు జాగ్రత్త'. విడుదలకు సిద్ధమైన ఈ చిత్రం గురించి నిర్మాత రామబ్రహ్మం సుంకర చెబుతూ, ' 'ఈడోరకం-ఆడోరకం' తర్వాత మా బ్యానర్లో రాజ్‌తరుణ్ నటిస్తున్న చిత్రమిది. హిలేరియస్ కామెడీ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. ఇందులో రాజ్ తరుణ్ కుక్కలను కిడ్నాప్ చేసే యువకుడి పాత్రలో కనిపిస్తాడు. డబ్బు కోసం కుక్కులను కిడ్నాప్ చేయడమే కాకుండా ప్రేమ కోసం ఏం చేశాడనేది తెరపైనే చూడాలి. అనేక మలుపులతో, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో ఆసక్తికరంగా సాగుతుంది.
ఇటీవల 'గౌతమిపుత్ర శాతకర్ణి' వంటి హిస్టారికల్ చిత్రానికి సంభాషణలు రాసి మెప్పించిన సాయిమాధవ్ ఈ సినిమాకు ఫన్నీ డైలాగులు అందించారు. బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించడం విశేషం. అనూప్ రూబెన్స్ అద్భుతమైన బాణీలను సమకూర్చారు. సినిమాను ఫిబ్రవరి 17న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం' అని అన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







