టెర్రరిస్ట్‌లకు బదులు శరణార్థులపై దాడి:'పెద్ద పొరపాటు చేశాం'...
- January 18, 2017
కానో: నైజీరియాలో ఘోరం జరిగింది. బోకో హారం తీవ్రవాదుల పైన వైమానిక దాడి చేయగా అది పొరపాటున శరణార్థుల శిబిరం పైన పడ్డాయి. ఈ ఘటనలో వందమంది వరకు మృతి చెందారని తెలుస్తోంది.
శరణార్థులతో పాటు వైద్యం సహా అనేక సేవలు అందిస్తున్న స్వచ్చంధ కార్యకర్తలు సైతం మృత్యువాత పడ్డారు. ఈశాన్య నైజీరియాలోని రన్ నగరం చాన్నాళ్లుగా బోకో హారం తీవ్రవాదుల గుప్పిట్లో ఉంది.
ఈ నగరం పైన సైనిక చర్యకు దిగిన నైజీరియా బలగాలు మంగళవారం నాడు వైమానిక దాడులు నిర్వహించాయి. రన్‌లోని తీవ్రవాదులు శిబిరాలు లక్ష్యంగా ఆకాశం నుంచి బాంబుల వర్షం కురిపించగా.. శరణార్థుల శిబిరంపై పడ్డాయి.
తమ వైపు నుంచి పెద్ద పొరపాటు జరిగిందని మిలిటరీ కమాండర్ మేజర్ జనరల్ లక్కీ ఇరాబర్ తెలిపారు.
కాగా, నైజీరియా మిలటరీ దాదాపు తొలిసారి ఇలాంటి పొరపాటును ఒప్పుకుంది. ఈ ఘటనపై నైజీరియా ప్రెసిడెండ్ ముహమ్మదు బుహారీ ఆవేదన వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







