జల్లికట్టు పోరాటానికి కోటి రూపాయలైనా ఇస్తా: నటుడు లారెన్స్..
- January 18, 2017
జల్లికట్టు కోసం పోరాడుతున్న విద్యార్థులకు బాసటగా నిలుస్తూ నటుడు, దర్శకుడు లారెన్స్ బుధవారం మధ్యాహ్నం మెరీనా తీరానికి వెళ్లారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులతో కలిసి నినాదాలు చేశారు. అంతేకాదు, ఈ పోరాటంలో పాల్గొనే వారి ఆకలి దప్పుల కోసం కోటి రూపాయలు ఖర్చయినా తాను భరిస్తానని ప్రకటించి తన పెద్ద మనసు చాటుకున్నారు. ఆయన మాట్లాడుతూ... 'జల్లికట్టు కోసం తమిళులందరూ ఒక్కటయ్యారు. ఇదే మనకి సగం విజయం. నటీనటులందరూ జల్లికట్టుకి మద్ధతు తెలుపుతుండడం హర్షణీయం. నిన్న (మంగళవారం) నాకు ఒక సందేశం వచ్చింది. పోరాటంలో పాల్గొన్న వారికి ఆహారం, మంచినీళ్లు లభించడం లేదని. వరదలు వచ్చినప్పుడు సాయం చేశాం.
ఈ పోరాటానికీ చేస్తాం. కోటి రూపాయలు ఖర్చయినా ఇవ్వడానికి సిద్ధం. జల్లికట్టు తమిళ సంప్రదాయానికి అద్దం పట్టే క్రీడ. దానిని జరుపుకోకుండా అడ్డుపడే విదేశీ శక్తులను అడ్డుకోవాలి.
జల్లికట్టు నిర్వాహకుల నుంచి విద్యార్థులు, సినీ కళాకారుల వరకు డిమాండ్ చేస్తున్నారు. ఇది న్యాయమైనది. రాష్ట్ర ప్రభుత్వం జల్లికట్టుని జరపాలనే తీర్మానాలు చేసింది. అయినప్పటికీ కేంద్రం ఇంకా పూర్తిగా దృష్టి సారించాలి.
విద్యార్థుల పోరాటాన్ని చూసి కేంద్రం దిగొస్తే మంచిది' అని లారెన్స్ ఆవేశంగా మాట్లాడారు.
తాజా వార్తలు
- వర్షాకాలానికి ముందస్తు జాగ్రత్తలు తీసుకోండిని.. ప్రజలకు అష్ఘల్ సూచన..!!
- బహ్రెయిన్‌లో ప్రవాసుల వైద్య రుసుముల సవరణకు యోచన..!!
- ఒమన్‌లో సముద్ర తాబేళ్ల సంరక్షణకు ప్రత్యేక చర్యలు..!!
- దుబాయ్‌లో అక్టోబర్ 19 నుంచి ఉచిత వైద్య పరీక్షలు..!!
- మధ్యప్రాచ్యంలోనే తొలిసారిగా అంతరిక్షానికి బయోలాజికల్ శాంపిల్స్..!!
- రియాద్‌లో మళ్లీ క్షిపణి దాడి.. శకలాలు పడి ప్రవాసికి గాయాలు
- నెట్‌ఫ్లిక్స్‌లో భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు షాక్!
- తెలంగాణ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలోకి వంగవీటి రాధా
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!







