అమెరికా 45వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం
- January 20, 2017
అగ్రరాజ్యం అమెరికా 45వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేశారు. శ్వేతసౌధంలో అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమానికి లక్షలాదిగా ప్రజలు తరలివచ్చారు. ప్రమాణం చేసిన అనంతరం దేశాధ్యక్షుడి హోదాలో ట్రంప్ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. నేటి నుంచి దేశంలో ప్రజా పాలన తిరిగి వచ్చిందని.. వాషింగ్టన్ నుంచి ప్రజలకు అధికారాన్ని బదిలీ చేస్తామని హామీ ఇచ్చారు. అమెరికా గమ్యాన్ని మనమంతా కలిసి నిర్ణయిద్దామని పిలుపునిచ్చారు. ప్రజలకు సేవ చేసేందుకే అధికారం ఉందన్నారు. మనదంతా 'ఒకే దేశం- ఒకే హృదయం' అని పేర్కొన్నారు. దేశమే అందరికీ తొలి ప్రాధాన్యం కావాలని.. అన్నింటా అమెరికన్లకే తొలి ప్రాధాన్యత ఉండాలని ట్రంప్ చెప్పారు. అమెరికా ప్రజలకు ప్రయోజనం కలిగేలా ప్రతీ నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
అమెరికన్ల చేతుల మీదుగానే అమెరికా పునర్ నిర్మాణం జరగాలని ఆకాంక్షించారు. ఇప్పటివరకు నిర్లక్ష్యానికి గురైనవారు.. ఇక ఎంతోకాలం నిరీక్షించాల్సిన అవసరం లేదన్నారు. ఐకమత్యంగా ఉంటే అమెరికాను ఎవరూ ఆపలేరని స్పష్టం చేశారు. వర్ణమేదైనా అందరిలో దేశభక్తి నిండి ఉందని ఉద్ఘాటించారు. సవాళ్లను ఎదుర్కొంటూ విజయవంతంగా ముందుకు సాగుదామన్నారు. మానవాళికి పెనుభూతంగా అవతరించిన ఉగ్రవాదాన్ని భూమిపై నుంచి పూర్తిగా నిర్మూలిద్దామని పిలుపునిచ్చారు.





తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







