'టామ్‌కామ్‌' బాసట గల్ఫ్‌ ఉద్యోగార్థులకు...

- January 22, 2017 , by Maagulf
'టామ్‌కామ్‌' బాసట గల్ఫ్‌ ఉద్యోగార్థులకు...

అర్హులైన అభ్యర్థులను గల్ఫ్‌ కంపెనీలు ఎంపిక చేసుకునేందుకు ప్రభుత్వ రంగ సంస్థ 'టామ్‌కామ్‌' సహకరిస్తుందని మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. గల్ఫ్‌లో ఉద్యోగాలకు అనువుగా వీలైతే అభ్యర్థులకు తామే శిక్షణ ఇప్పించడానికి కూడ సిద్ధమని ఆయన చెప్పారు. దళారుల ప్రలోభాలతో వృత్తి నైపుణ్యంలేని యువత ఉద్యోగాల కోసం గల్ఫ్‌కు వస్తుండడంతో అటు యాజమానులతో పాటు రాషా్ట్రనికీ, దేశానికి కూడ ఇబ్బంది, నష్టం కల్గిస్తుందని మంత్రి చెప్పారు. కువైట్లోని భారతీయ ఎంబసీ అవరణలో శనివారం ఓ సదస్సులో ఆయన ప్రసంగించారు.

కువైతీ యాజమాన్యాల ప్రతినిధులతో మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్ధ ద్వారా నియామకంతో ఖర్చు తగ్గి, అర్హులైన వారిని ఎంపిక చేసుకోవచ్చని సూచించారు. కువైట్లో 1.2బిలియన్‌ దినార్లతో ప్రాజెక్టులు ప్రారంభం కానున్నాయని, దీనికి నిపుణులపై 50వేల మంది ఉద్యోగ, కార్మికులు అవసరమని కువైటీ ప్రతినిధులు మంత్రితో చెప్పారు. గల్ఫ్‌ పర్యటనలో ఉన్న నాయిని శుక్రవారం ఖతర్‌లోని తెలంగాణ ప్రవాసీ ప్రముఖులను కలిశారు. తెలంగాణ యువతను సురక్షితంగా గల్ఫ్‌ ఉద్యోగాలలో నియమించేలా 'టామ్‌కామ్‌' ద్వారా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను మంత్రి వారికి వివరించారు.

ఈ మేరకు మూడు సంస్ధలతో ఒప్పందాలు కుదుర్చుకోవడంలో ప్రవాసీయులు మంత్రికి సహాయపడ్డారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com