భూకంపం.. సునామీ హెచ్చరిక...
- January 22, 2017
పోర్ట్ మోర్స్‌బై: పపువా న్యూ గినియా తీర ప్రాంతంలో ఆదివారం ఉదయం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 8గా నమోదైంది. సునామీ వచ్చే అవకాశముందని పసిఫిక్ సునామీ హెచ్చరిక కేంద్రం ప్రకటించింది. పన్‌గున ఐలాండ్‌లో, బౌగన్‌విల్లే ఐలాండ్‌లో కొన్ని ప్రాంతాల్లో న్యూగినియాకు పశ్చిమాన 40 కిలోమీటర్ల దూరంలో భూ ప్రకంపనలు చోటుచేసున్నాయి. పపువా న్యూ గునియా తీరంలో, సోలమన్ ఐలాండ్, నౌరు, కోస్రే, వనౌతు, ఇండోనేషియాలపై ఈ భూకంప ప్రభావం ఉంటుందని అమెరికా జియోలాజికల్ సర్వే అధికారులు చెబుతున్నారు.
ఆస్ట్రేలియాకు మాత్రం ఎలాంటి ప్రమాదం లేదని తెలిపారు. 95.5 మైళ్లు లోతున సముద్రంలో భూకంప కేంద్రం ఉన్నట్టు గుర్తించారు. రింగ్ ఆఫ్ ఫైర్ జోన్‌లో ఈ దీవులు ఉండటంతో తరచుగా ఇక్కడ భూకంపాలు సంభవిస్తాయన్న విషయం తెలిసిందే. జియోలాజికల్ సర్వే సునామీ వార్నింగ్‌తో న్యూ గినియా అధికారులు అప్రమత్తమయ్యారు. చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.
తాజా వార్తలు
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- మరో మలేసియా విమానం మిస్సింగ్ 11 మంది పై ఉత్కంఠ!







