తమిళనాడులోని అనేక ప్రాంతాల్లో ఆదివారం జల్లికట్టును నిర్వహించారు..

- January 22, 2017 , by Maagulf
తమిళనాడులోని అనేక ప్రాంతాల్లో ఆదివారం జల్లికట్టును నిర్వహించారు..

చెన్నై : తమిళనాడులోని అనేక ప్రాంతాల్లో ఆదివారం జల్లికట్టును నిర్వహించారు. తిరుచిరాపల్లి సహా చాలా చోట్ల సంప్రదాయబద్ధంగా ఎద్దులతో పోరాడారు. విజేతలకు నగదు బహుమతులు అందజేశారు. తమిళనాడు ముఖ్యమంత్రి అళంగనళ్ళూరులో జల్లికట్టును ప్రారంభించవలసి ఉంది. కానీ అక్కడి ప్రజలు తమకు శాశ్వత పరిష్కారం కావాలని, తాత్కాలిక ఆర్డినెన్స్‌ కాదని పట్టుబట్టడంతో జల్లికట్టు రద్దయింది. దీంతో ఆయన దిండిగల్లులో జల్లికట్టును ప్రారంభిస్తారని సమాచారం. తిరుచిరాపల్లిలోని మనపురాయ్‌లో జల్లికట్టు ఆనందోత్సాహాల మధ్య ప్రారంభమైంది. వేలాది మంది ప్రజలు సంతోషంతో కేరింతలు కొట్టారు. దూసుకొస్తున్న ఎద్దును అదుపు చేసేందుకు యువకులు సాహసోపేతంగా ప్రయత్నించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com