మక్కా మృతుల అంత్యక్రియలకు తెలంగాణా ప్రభుత్వం ఏర్పాట్లు

- September 14, 2015 , by Maagulf
మక్కా మృతుల అంత్యక్రియలకు తెలంగాణా ప్రభుత్వం ఏర్పాట్లు

సౌదీ అరేబియాలోని మక్కా మసీదులో శుక్రవారం భారీ క్రేన్ కూలిన దుర్ఘటనలో మృతి చెందిన వారికి అక్కడే అంత్యక్రియలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మృతుల బంధువుల కోరిక మేరకు మక్కాలోనే అంత్యక్రియలు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. మక్కా ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు తెలంగాణ సీఎం కేసీఆర్ సానుభూతి తెలిపారు. మక్కా ప్రమాద వివరాలు తెలుసుకునేందుకు 040-23214125 హెల్ప్ లైన్ నంబర్ ను ఏర్పాటు చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com