స్పెషల్ స్టేటస్ కోసం పవన్ కి మెగా బ్రదర్ మద్దతు...
- January 25, 2017
ఆరు నెలల క్రితం పవన్ ఆంద్రప్రదేశ్ కు స్పెషల్ స్టేటస్ అంటే.. ఎక్కడో సంపూర్ణేష్ బాబు, శివాజీ లాంటి వారు తప్ప మరో గొంతు జతకలవలేదు. కానీ ఏపీ యువత జల్లి కట్టు స్పూర్తి తో మరో సారి ఆంద్ర ప్రదేశ్ స్పెషల్ స్టేటస్ పై పోరాటాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు.. ఈ నెల 26 న విశాఖ ఆర్కీ బీచ్ వేదికగా యువత తమ నిరసనని శాంతి యుతంగా మౌన పోరాటం చెయ్యడానికి రెడీ అవుతున్నారు ఈ పోరాటానికి జనసేన అధినేత సంపూర్ణ మద్దతు తెలిపారు.. కాగా యువత మౌన పోరాటానికి శర్వానంద్, నాని, త్రివిక్రం, సందేప్ కిషన్, నిఖిల్, సంపూర్ణేష్ బాబు, మంచు మనోజ్, తమ్మారెడ్డి భరద్వాజ్ వంటి వారు మద్దతు తెలిపారు. మెగా ఫ్యామిలీ నుంచి వరుణ్ తేజ్, సాయి ధరం తేజ్ లు కూడా ఏపీ స్పెషల్ స్టేటస్ కోసం పోరాడే యువతకి తమ సంపూర్ణ మద్దతు ఉన్నదని ట్వీట్ చేశారు.. తాజాగా మెగా బ్రదర్ నాగబాబు కూడా తన పూర్తి మద్దతు తెలిపాడు.. కేంద్రం ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇవ్వాల్సిందే అని.. ఈ విషయంలో పోరాడుతున్న పవన్ కళ్యాణ్ కు, యువతకు, మిగిలిన పార్టీల వారికి తన సంపూర్ణ మద్దతు ఉంటుంది అని ఓ వీడియో సందేశాన్ని నాగబాబు ఇచ్చారు.. ఇక మెగా ఫ్యామిలీ నుంచి బన్నీ, చరణ్ లు తమ అభిప్రాయాన్ని తెలిపాల్సి ఉన్నది.
తాజా వార్తలు
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...







