పోలీస్ ను పొడిచిన 16 ఏళ్ళ బాలిక

- January 26, 2017 , by Maagulf
పోలీస్ ను పొడిచిన 16 ఏళ్ళ బాలిక

ఐసిస్ పై సానుభూతితో ఓ బాలిక పోలీసు అధికారిపై దాడి చేసింది. దీంతో ఆ బాలికను పోలీసులు జైల్లో పెట్టారు. ఈ ఘటన జర్మనీలో చోటుచేసుకొంది. జర్మనీలోని హనోవర్ ప్రాంతానికి చెందిన సఫియా ఎస్ అనే బాలిక ఐసిస్ ప్రభావానికి గురైంది. ఇస్లామిక్ స్టేట్ భావజాలంతో ఆమె ప్రేరేపితురాలైంది. ఐసిస్ పై సానుభూతితో ఓ పోలీసు అధికారిపై కత్తితో దాడిచేసింది. పోలీసు అధికారిని విచక్షణ రహితంగా పొడిచింది. ఈ బాలిక పోలీస్ అధికారిపై దాడి చేసేందుకు గల కారణాలు స్పష్టంగా తెలియరాలేదు. అయితే ఐసిస్ ను కాపాడేందుకే తాను ఈ పనిచేసినట్టుగా ఆ బాలిక చెప్పినట్టుగా పోలీసులు చెబుతున్నారు. బాలికను అరెస్టు చేశారు. కోర్టు ఆమెకు ఆరేళ్ళ శిక్ష విధించింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com