879 విదేశీ ఖైదీలు

- January 26, 2017 , by Maagulf
879 విదేశీ ఖైదీలు

జెద్దాహ్: పబ్లిక్‌ ఇన్వెస్టిగేషన్‌ ప్రిజన్స్‌లో ఉన్న 5,084 మంది ఖైదీల్లో 829 మంది విదేశీయులు ఉన్నారని అధికారులు వెల్లడించారు. విదేశీ ఖైదీల లిస్ట్‌లో ఆఫ్ఘనిస్తాన్‌, అంగోలా, ఇథియోపియా, జోర్డాన్‌, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌, బహ్రెయిన్‌, అల్జీరియా, సుడాన్‌, సోమాలియా, చైనా, ఇరాక్‌, ఫిలిప్పీన్స్‌, మొరాకో, ఇండియా, యునైటెడ్‌ స్టేట్స్‌, ఇరాన్‌, యెమెన్‌, పాకిస్తాన్‌, బెల్జియం, బంగ్లాదేశ్‌, చాద్‌, టర్కీ, లెబనాన్‌, మాలి, ఈజిప్ట్‌, మారిటానియా, పాలస్తీన్‌, నిగెర్‌ దేశాలకు చెందినవారితోపాటు ఇంకొందరు కూడా ఉన్నారు. ఈ లిస్ట్‌లో మొదటి స్థానంలో యెమెన్‌కి చెందిన 281 మంది ఉన్నారు. ఆ తర్వాతి స్థానంలో 217 మందితో సిరియా, 68 మందితో పాకిస్తాన్‌ ఉన్నాయి. అయితే అరెస్టయినవారంతా క్రిమినల్స్‌ కాదనీ, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో కొందరు అరెస్టయి ఉంటారని, అమాయకులు విడుదల చేయబడ్తారని మినిస్ట్రీ ఆఫ్‌ ఇంటీరియర్‌కి చెందిన స్ట్రాటజిక్‌ ప్లానింగ్‌ ఆఫీస్‌ డైరెక్టర్‌ బ్రిగేడియర్‌ జనరల్‌ బస్సామ్‌ అతియా చెప్పారు. విదేశీయులు దేశంలోని చట్టాల్ని గౌరవిస్తున్నందుకు వారిని అభినందిస్తున్నామని చెప్పారాయన. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com